Monday, 3 September 2012
సామాజిక పెట్టుబడిగా భావించాలి:గట్టు
ఫీజురీయింబర్స్ మెంట్ నిధులను సామాజిక పెట్టుబడిగానే భావించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. పదివేల లోపు ర్యాంకులు వచ్చినవారికి మాత్రమే ప్రభుత్వం మొత్తం ఫీజు చెల్లించడం అంటే బలహీనవర్గాల పట్ల వివక్ష చూపడమేనన్నారు. ఈ పథకం ఆర్థిక అసమానతలు తొలగిపోయేందుకు దోహదపడుతుందన్న ఉద్దేశంతో ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అర్హులు అందరికి మొత్తం ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ కు ఏదో ఒక పేరుతో కోతలు విధించడం అంటే ఈ పథకాన్ని నీరుగార్చడమేన్నారు. ఈ పథకం రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన విమర్శించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment