స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిగో ....ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి న్యాయస్థానం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం ఆదేశించింది. మూడు నెలల్లోగా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లు తక్షణమే చేయాలని సూచించింది. తాజా గణాంకాలు అందుబాటులో లేకున్నా సరే, 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
కాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం గతేడాది ఆగస్టులో ముగిసింది. జనాభా లెక్కలు, రాజకీయ కారణాలు చూపుతూ రాష్ట్ర సర్కారు ఎన్నికల్ని ఇంత కాలం వాయిదా వేస్తూ వస్తోంది. గతేడాది ఆగస్టు నుంచి స్థానిక సంస్థలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 1500 కోట్ల రూపాయల నిధులు ఆగిపోయాయి. మరో వైపు రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 70 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.

No comments:
Post a Comment