పులివెందుల : రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కునేందుకు పార్టీ సిద్ధంగా ఉందని విజయమ్మ మంగళవారమిక్కడ తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు నేనున్నానన్న భరోసా ఇచ్చారని విజయమ్మ గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కుల, మతాలకు అతీతంగా అమలు చేశారని ఆమె గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం భారంగా భావిస్తోందని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వైఎస్ఆర్ ప్రభంజనాన్ని సృష్టిస్తారని ఆమె అన్నారు.

No comments:
Post a Comment