న్యూఢిల్లీ/ ముంబై/ చెన్నై, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనకు మెట్రో నగరాల్లో ఘనంగా నివాళులర్పించారు. మూడో వర్ధంతి సందర్భంగా తమిళనాడులోని తెలుగు వారు ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. చెన్నై, వేలూరు, తిరువళ్లూరు, పళ్లిపట్టు, పొద్దుటూరుపేటల్లో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జరిగారుు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విభాగం నేతలు ఎ.కె. జాకీర్ హుస్సేన్, పెరంబూరు కె.శరవణన్, కెప్టెన్ కె.మణి వన్నన్, కె.బాలు, ఎం. సతీశ్, ఆనంద్, పళని, వెంకటేశ్ నేతృత్వంలో చెన్నైలోని పెరంబూరు, రాయపురం, చేట్‌పట్‌లలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వై.ఎస్. జగన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్యారిస్‌లోని వరద ముత్తయప్ప వీధిలో, తరమణి వైఎస్సార్ అభిమానుల నేతృత్వంలో ఓఎంఆర్ రోడ్డులోని కారపాక్కంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. తిరువళ్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు సురేశ్ బాబు నేతృత్వంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పలు ప్రాంతాల్లో పేదలకు అన్నదానం, చీరలు పంపిణీ చేశారు.
మహారాష్ర్ట, ఢిల్లీలోనూ...: వైఎస్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీభవన్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రవాసాంధ్రుల వైఎస్సార్ ట్రస్ట్ ఢిల్లీ అధ్యక్షుడు కేఎస్.నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన జనహృదయ నేత వైఎస్ అన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో ముంబై, పుణే, షోలాపూర్ సహా పలు ప్రాంతాల్లో వైఎస్‌కు తెలుగు ప్రజలు ఘన నివాళులు అర్పించారు. వైద్య శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముంబైలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు, వివిధ సంఘాల నాయకులు హాజరై మహానేతకు నివాళులు అర్పించి ఆయన సేవలను మననం చేసుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నందమూరి లక్ష్మీపార్వతి ప్రసంగిస్తూ తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
Will there be any problem for the INC supremo? Because there was problem for her about OODARPU YAATHRA.
ReplyDelete