పేదలకు ఉన్నత విద్య అందుబాటులోకి రావాలని, పేదరికాన్ని పారదో లడానికి అదొక్కటే మేలిమైన మార్గమని గ్రహించి, అందుకు అనుగుణంగా ఆచరణయోగ్యమైన పథకాలను రూపొందించి వివిధ స్థాయిల్లో చిత్తశుద్ధితో అమలుజరిపిన ఖ్యాతి వైఎస్‌కే దక్కుతుంది. గ్రామాల్లో ఉపాధి కరువై అల్లాడుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు తమకున్న చదు వుతో ఉన్నచోటే సాంకేతిక విద్య అభ్యసించగలిగితే ఉపయుక్తంగా ఉంటుం దని వైఎస్‌కు తెలుసు కాబట్టే ఐఐటీకి బదులు ట్రిపుల్ ఐటీలను గ్రామ సీమలకు తెచ్చాడు. యావత్ దేశంలోనే ట్రిపుల్ ఐటీలను గ్రామీణ ప్రాం తాల్లో నెలకొల్పిన మొట్టమొదటి నేత వైఎస్. ట్రిపుల్ ఐటీ, విద్యారంగాన్ని ఓ వెలుగు వెలిగించింది. కొత్త ఆశలు రేపింది. జిల్లాకొక విశ్వవిద్యాలయ ప్రతిపాదనతో మొదట కడపలో వేమన విశ్వవిద్యాలయం స్థాపించారు.
కేంద్రీయ విశ్వవిద్యాలయం కంటే ఎక్కువ వసతులు ఏర్పాటు చేసి వేమన విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాడు. రాజమండ్రిలో నన్నయ్య, నల్లగొండలో మహాత్మాగాంధీ, నిజామాబాద్‌లో తెలంగాణ, కరీంనగర్‌లో శాతవాహన విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, బడుగు బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేరనే చేదు నిజం వైఎస్‌కు తెలుసు. అందుకే కనీవినీ ఎరుగని ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రవేశపెట్టాడు. ఏ సంక్షేమ కార్యక్రమానికి రానటువంటి స్పందన ఈ పథకానికి వచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అతని కీర్తిని దేశం నలుచెరగులా వ్యాపింపచేసింది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ స్కూళ్లలో చదివే పిల్లలకు స్కాలర్ షిప్పులు, వసతులు పెంచటం, వాటిపై అజమా యిషీ పెంచటం ఆ వర్గాలలో ఉత్తేజాన్ని నింపింది. ఒక కొత్త ఆశల వనాన్ని వైఎస్ సృష్టించాడు. అతడు వేసిన బాటను విడనాడి ఎవరైనా పక్కదారి పడితే వారు చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పనిస్థితి కల్పించాడు.
-చుక్కా రామయ్య విద్యావేత్త, ఎమ్మెల్సీ
నిత్య ‘కృషీవలుడు’
వ్యవసాయ రంగం రాష్ట్రంలో అన్ని విధాలుగా ధ్వంసమైపోయిన తరు ణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర పాలనాధికారం చేపట్టి మౌలికమైన, సుస్థిరమైన మార్పునకు నాంది పలికారు. రైతుల సంక్షేమం కోరి జయతీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పరచి ఆమె సిఫార్సులను అమలు చేసేం దుకు గట్టి కృషి చేశారు. కోనేరు రంగారావు కమిషన్ భూమికి సంబంధించి చేసిన సిఫార్సులలో కొన్నింటిని తీసుకుని శ్రద్ధగా అమలుపరిచారు. రైతాం గానికి ఉచిత విద్యుత్తును అందించి కరెంటు కష్టాల నుంచి వారిని గట్టెక్కించారు. చాలినన్ని జలవనరులు అందించి వ్యవసాయరంగాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపించారు. నిద్రావస్థలో ఉన్న సహకార పరపతి సంఘాలను పునరుద్ధరించారు. రుణాల మాఫీతోపాటు, రుణాలపై వడ్డీ మాఫీచేసి లక్షలాది మంది రైతులకు మేలుచేశారు. రుణవసతిని మూడిం తలు పెంచారు. పావలా వడ్డీ రుణ పథకాన్ని రైతాంగానికి అమలు చేయ డంతో ఆగక వారికి నష్టపరిహారం కూడా చెల్లించి ఆదుకున్నారు. వ్యవ సాయ బీమా పథకాన్ని అమలుచేసేందుకు కృషిచేశారు.
తాడేపల్లిగూడెం సమీపంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం స్థాపించి రైతాంగానికి స్వావలం బన కల్పించేందుకు తన వంతు ప్రయత్నంచేశారు. పాడి-పంటల మధ్య అన్యోన్యతను గుర్తెరిగి పాడి పరిశ్రమను పెంచి పోషించేందుకు ‘పశుక్రాంతి’ పథకం ఆరంభించారు. ‘ఇందిరా క్రాంతి’ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులు పండించే పంటను సెల్ఫ్ హెల్ఫ్ మహిళా గ్రూపుల ద్వారా కొనుగోలు చేయించి మధ్య దళారీల బెడదను తొలగించారు. వైఎస్ అనంతర కాలంలో వ్యవసాయరంగం త్రీవ సంక్షోభంలో పడింది. సాగునీరు, విద్యుత్తు కొర తతో పాటు విత్తనాలు, ఎరువుల కొరత, ప్రోత్సాహకాలలేమి, సాంకేతిక విజ్ఞానం కొరత రైతాంగాన్ని బలవంతపు ‘పంట సెలవు’ దిశగా నెడుతు న్నాయి. వైఎస్ స్ఫూర్తి లేకుండా ఈ పరిస్థితిలో మార్పు అసాధ్యం.
-ప్రొ॥కె.ఆర్.చౌదరి వ్యవసాయరంగ నిపుణులు
అపర ‘భగీరథుడు’
రాష్ట్ర నీటిపారుదల రంగం క్షీణదశలో ఉన్నప్పుడు రైతుల పొలాలకు నీరందించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి అపర భగీరథుడి వలె అవతరించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టగానే ఆయన తలపెట్టిన జలయజ్ఞం రాష్ట్ర నీటిపారుదల రంగాన్ని మలుపుతిప్పింది. కనీవినీ ఎరుగని రీతిలో కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించే జలయజ్ఞంలో, ఒక్క సాగునీటి సదుపాయమే కాకుండా తాగునీరు, కాలువలకు మరమ్మత్తులు, ఆధునికీకరణ, వరదకట్టల నిర్మాణం ఇమిడి ఉన్నాయి. జలయజ్ఞం ద్వారా 103.22 లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకువచ్చే ప్రాజెక్టులను చేపట్టారు. గత పాలకులు కేవలం కాగితాల మీద కూడా మంజూరు చేయడానికి వెనుకాడిన, ఏళ్ల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను జలయజ్ఞం ద్వారా ఆచరణ సాధ్యం చేసిన గొప్పనాయకుడు వైఎస్. 490 మీటర్ల ఎత్తుకు నీటిని తోడి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దేవాదుల ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు.
తెలంగాణలోని ఏడు జిల్లాల్లో 14.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 550 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించే ప్రాణహిత-చేవేళ్ల పథకాన్ని చేపట్టారు. ఏ నాటి నుంచో కాగితాలకే పరిమితమై ఉన్న పొలవరం ప్రాజెక్టు పనుల్ని చేపట్టిన ఘనత వైఎస్‌దే. కుడి, ఎడమ కాలువలను పూర్తి చేయడమే కాకుండా హెడ్ వర్క్స్ పనులకు టెండర్లను కూడా పిలిచారు. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని జిల్లాలకు వీలైనన్ని ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని, తాగు నీటిని అందించడమే వైఎస్ లక్ష్యం. సాగునీటి వనరుల కల్పనలో సాధ్యం కాదని వదిలేసిన అనేక ప్రాజెక్టులకు నాందిపలికి అవి ఆచరణ సాధ్యమేనని నిరూపించిన అరుదైన నాయకుడు వైఎస్. రాష్ట్ర సౌభాగ్యానికి దోహదం చేసే జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి.
-సీతాపతిరావు రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి రంగ మాజీ సలహాదారు.
పేద ప్రజల ‘డాక్టర్’
మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా వైద్య ఆరోగ్య రంగాలపై అత్యల్ప మొత్తం వెచ్చిస్తున్న నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజారోగ్య రంగానికి అందించిన సేవలు గణనీయమైనవని చెప్పాలి. స్థూల జాతీయో త్పత్తిలో 5 నుంచి 6 శాతం దాకా ఖర్చు పెడితే తప్ప మన దేశ ప్రజల కనీస ఆరోగ్య అవసరాలు తీరవు. ప్రస్తుతం 1.2 శాతం మాత్రమే వెచ్చిస్తున్న మన ప్రభుత్వాలకు వ్యయం మొత్తాన్ని 2 శాతానికి పెంచడానికి కూడా చేతులు రావడం లేదు. గత 30 ఏళ్లలో గ్రామీణ ప్రజల ఆరోగ్యం అడుగంటి పోయింది. చైనాతో పోల్చుకుంటే మన దేశం ఆరోగ్యరంగంలో బాగా వెనుకబడి ఉంది. దేశ ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించని నేపథ్యంలో మన రాష్ట్రంలో వైఎస్ శిక్షణ పొందిన వైద్యునిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే పేదప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేశారు.
భారీ ఖర్చుతో కూడుకున్న గుండె జబ్బులు, ఇతర ప్రాణాంతక వ్యాధులకు అవసరమైన చికిత్సను పేదసాదలకు అందించేందుకు వైఎస్ ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా మార్గం సుగమం చేశారు. ముఖ్యంగా లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలకు నోచుకోని పేదలకు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందే ఉన్నతస్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రఖ్యాతి వైఎస్ సొంతం. వైద్య విద్యలో శిక్షణ పొందిన డాక్టర్‌గానే కాక, బాధ్యతగల పౌరునిగా కూడా వైఎస్‌కు సమాజం పట్ల ఒక మానవీయ దృక్పథం ఉంది. ఆ దృక్పథాన్ని ఎన్ని ఒడిదు డుకులు ఎదురైనా అమలు చేయగల నైతిక స్థయిర్యం ఉంది. అదే ఆయనను పేదలకు చేరువ చేసింది. మన దేశంలో 60 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నిరుపేదలుగా ఉన్నారనే వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించ నిరాక రించినా, వైఎస్ గుర్తించారు. గుర్తించి అందుకు అనుగుణంగా ఆచరణలో ఫలితాలను ఇవ్వగల చర్యలను చేపట్టారు.
-డా॥డి.రాజారెడ్డి ప్రముఖ నాడీమండల వ్యాధినిపుణులు

No comments:
Post a Comment