ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు తొలిసారిగా బడ్జెట్ కేటాయింపులు జరిపి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారని ఈబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్రెడ్డి అన్నారు. ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్ మూడో వర్ధంతిని నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రవీందర్రెడ్డి మాట్లాడుతూ ఈబీసీ విద్యార్థుల ఉన్నత చదువులకోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసిన ఘనత వైఎస్దేనన్నారు. కార్యక్రమంలో పలువురు ఈబీసీ నాయకులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment