ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్‌ఆర్ ప్రస్థానంకు సంబంధించిన పుస్తకాన్ని పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆదివారం ఇడుపులపాయలో ఆవిష్కరించారు. మహానేత మూడో వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త రవికిరణ్ అనే వ్యక్తి దాదాపు లక్ష పుస్తకాలను ముద్రించి ఉచితంగా పంపిణీ చేయడానికి ఈ పుస్తకాన్ని మొదటిసారిగా విజయమ్మ చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ పుస్తకంలో వైఎస్‌ఆర్ జీవిత చరిత్రకు చెందిన ఫొటోలతోపాటు పలు అంశాలను ముద్రించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, విజయ్‌కుమార్ అనే న్యాయవాదులు, అర్జున్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ మాలతో మహానేతకు నివాళి
ఇడుపులపాయ, న్యూస్‌లైన్ : అనంతపురం జిల్లాకు చెందిన దాదాపు 50 మంది మహానేత అభిమానులు వైఎస్‌ఆర్ మాలధరించి ఆదివారం ఇడుపులపాయకు విచ్చేసి మహానేత వైఎస్‌ఆర్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంకు చెందిన అభిమానులు ఈ మాలతో దాదాపు 5రోజులపాటు పాదయాత్రగా అనంతపురంలోని గ్రంథాలయ కార్యాలయం నుంచి పాదయాత్ర చేపట్టి ఇడుపులపాయకు చేరుకున్నారు. అనంతపురం జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్.ఎం.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బాలకృష్ణారెడ్డి, రాము, లోకేష్, గంగాధర, కృష్ణప్ప, హుస్సేన్, పక్కీరప్ప, రామయ్య తదితరులు మాల ధరించిన వారిలో ఉన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నివాళి
ట్రిపుల్ ఐటీలో సాంకేతిక విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఆదివారం మహానేత వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించారు. ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ట్రిపుల్ ఐటీలోని దాదాపు 7వేలమంది ప్రత్యేక క్యూ లైన్లతో వచ్చి నివాళులర్పించారు. ఒకేసారి వేల సంఖ్యలో విద్యార్థులు రావడంతో వైఎస్‌ఆర్ ఘాట్ జన తాకిడికి కిక్కిరిసిపోయింది. కార్యక్రమంలో పీఈటీ కరుణాకర్ కోల్, ప్రొఫెసర్ కె.ఎల్.ఎన్.రెడ్డి పాల్గొన్నారు.
అన్నకు తమ్ముళ్ల నివాళి
పులివెందుల అర్బన్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వైఎస్ వివేకా కార్యాలయంలో ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరులు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రవీంద్రనాథరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డిలు అన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
పెద్దాయన మా ప్రాణం
పేదల పెన్నిధి పెద్దాయనను ఎప్పటికీ మరువలేమని వైఎస్‌ఆర్ ఘాట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది అభిమానులు పేర్కొన్నారు. వారిలో కొందరి అభిప్రాయాలివీ...
రాజన్న మాకు అల్లా...
మహానేత రాజన్న మాకు అల్లా లాంటి వారు. దేశంలో ముస్లింలకు ఎక్కడా లేని రిజర్వేషన్ మన రాష్ట్రంలో ఆ మహానేత అమలుపరిచారు. దీంతో అనేక మంది పేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ఆయన మేలు ఎన్నటికీ మరువలేదని.
- సత్తార్ (నరసరావుపేట), గుంటూరు
వైఎస్ రైతు బాంధవుడు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నదాత బాధలు అర్థం చేసుకున్నారు. అందులో భాగంగానే రైతుల రుణాలు మాఫీ చేశారు. ఉచిత కరెంటు ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం. - జి.నాగచంద్ర (కొత్తపేట), తూర్పుగోదావరి జిల్లా
ఇంజనీరు అవుతానని ఊహించలేదు
నేను నిరుపేదను. ఇంజనీర్ అవుతానని కలలో కూడా ఊహించుకోలేదు. వైఎస్ తాతయ్య ప్రవేశపెట్టిన ట్రిపుల్ ఐటీలో నాకు స్థానం లభించింది. బీటెక్ చదువుతున్నాను. మా కుటుంబం మొత్తం వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాం.
- ప్రతిభ (ట్రిపుల్ ఐటీ విద్యార్థి), ఇడుపులపాయ
వైఎస్ వల్లే జిల్లా అభివృద్ధి
ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకోని కడప జిల్లా మహానేత వైఎస్‌ఆర్ వల్లే ప్రగతి సాధించింది. కేవలం ఐదేళ్లలోనే అభివృద్ధి చేసి చూపించారు. కడపకు వైద్యకళాశాల, ట్రిపుల్ ఐటీ, జేఎన్‌టీయూ, వెలిగల్లు తదితర ప్రాజెక్టులు తీసుకొచ్చారు. - శ్రీనివాసులు, కడప
మహిళల అభివృద్ధి వైఎస్ పుణ్యమే
రాష్ట్రంలో మహిళలు చైతన్యవంతులై నేడు అభివృద్ధి చెందుతున్నారంటే అది ఒక్క వైఎస్‌ఆర్ పుణ్యమే. మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు. ఉద్యోగాలలో విరివిగా అవకాశాలు కల్పించారు. అనునిత్యం మహిళలగురించి ఆలోచించే వ్యక్తి వైఎస్‌ఆర్ మాత్రమే.
- అనుపమారెడ్డి (కొసమూరు) గుంటూరు
ఫీజు రీయింబర్స్‌మెంటు అమలుపరచాలి
మహానేత ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంటును ఈ ప్రభుత్వం కచ్చితంగా అమలుపరచాలి. లేదంటే పేద కుటుంబాల విద్యార్థులలో చదువులు ఆగిపోతాయి. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంటును కుదించకుండా యథావిధిగా కొనసాగించాలి. - నవ్య (తిరువూరు), కృష్ణా
వైఎస్ మాలతో మేలు జరుగుతోంది
వైఎస్ మాల ధరిస్తుండటంతో మా కుటుంబాలకు మేలు జరుగుతోంది. అందుకోసమే మూడేళ్లుగా అనంతపురం నుంచి వైఎస్‌ఆర్ మాల ధరించి పాదయాత్రగా ఇడుపులపాయకు వస్తున్నాం. దీంతో మా కుటుంబ సభ్యులు కూడా వైఎస్ మాలపట్ల గౌరవిస్తున్నారు.
- గంగాధర, అనంతపురం
సంక్షేమ పథకాలు అందడంలేదు
పేదలకు సంక్షేమ పథకాలు అందడంలేదు. వైఎస్ మరణించాక పేదలకు పథకాలు అందుతున్నాయా, లేదా అని విచారించే నాథుడే కరువయ్యారు.
- శంకర్, రాజేంద్ర,రాములు, నిజమాబాద్ వాసులు

No comments:
Post a Comment