మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర ప్రజానీకం ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయ అభిమానుల సందడితో జనసంద్రంగా మారింది. దివంగత నేతను స్మరించుకుంటూ చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తృతీయ వర్దంతిని ఆదివారం ఇడుపులపాయ వైఎస్ ఘాట్‌లో కుటుంబ సభ్యులు, ఆత్మీయలు నిర్వహించారు. ఉదయం 7.15 గంటలకు మహానేత వైఎస్ సతీమణి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిలమ్మ, అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్, కోడలు వైఎస్ భారతి, సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, సోదరి విమలమ్మ, మేనత్త కమలమ్మ, సోదరుల సతీమణులు వైఎస్ భారతమ్మ, సౌభాగ్యమ్మ, వియ్యంకుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, సుగుణమ్మ తదితర రక్త సంబంధీకులు నివాళలర్పించి ప్రార్థనలు చేశారు.
అటు తర్వాత ప్రజానీకానికి వైఎస్ ఘాట్ సందర్శన ప్రారంభమైంది. వైఎస్‌ఆర్ అమర్హ్రే, వైఎస్ జగన్ జిందాబాద్ అనే నినాదాలతో ఇడుపులపాయ మారుమోగింది. వైఎస్ సమాధి ముందు నిలబడి కంటతడి పెట్టేవారు కొందరైతే, సాష్టాంగ నమస్కారం చేసే వారు మరికొందరు. తమ చిన్నారులను సమాధిపై ఉంచి నివాళలర్పించే తల్లులు, వికలాంగులు, వృద్ధులు..ఉబికి వస్తున్న కన్నీళ్లతో మహానేత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ నివాళులర్పించారు. వైఎస్‌ఆర్ జిల్లాతోపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచిభారీ ఎత్తున ప్రజానీకం తరలి వచ్చారు. ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైఎస్ ఘాట్ జనరద్దీగా మారింది. ఘాట్‌కు చేరుకున్న ప్రతి ఒక్కరూ వైఎస్ విజయమ్మను చూసేందుకు ఇడుపులపాయలోని ఎస్టేట్‌కు చేరుకున్నారు. వారిని పలుకరించేందుకు పలుమార్లు వైఎస్ విజయమ్మ ప్రాంగణంలో కలియతిరిగారు. అలాగే రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సతీమణి సునీతమ్మ, కమలాపురం తొలి ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి, మాజీ మంత్రులు వైఎస్ వివేకానందరెడ్డి, పిల్లి సభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, భూమన కరుణాకర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి,తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యురాలు ఉప్పలపాటి కల్పన, టీటీడీ మాజీ సభ్యుడు సత్యనారాయణ తదితరులు మహానేతకు నివాళులర్పించారు.
విద్యాదాతకు ఆత్మీయ వందనం
ప్రభుత్వ చదువులతో పల్లెల గడపలో ఎదిగిన విద్యార్థులు వారు. అలాంటి వారికోసం ఉన్నత విద్యను అందించేందుకు ట్రిపుల్ ఐటీని రూపొందించిన విద్యావేత్త డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ట్రిపుల్ ఐటీని రూపొందించడం ఒక ఎత్తయితే, ట్రిపుల్ ఐటీ కోసం తన వ్యవసాయ క్షేత్రంలోని 350 ఎకరాలు అప్పగించడం మరో ఎత్తు. అలాంటి మహానేత తృతీయ వర్దంతి సందర్భంగా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైఎస్‌ఆర్ అమర్హ్రే అంటూ నినాదాలు చేస్తూ వైఎస్‌ఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. ఆరు వేల మంది విద్యార్థుల ర్యాలీగా రావడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరూ జనదేవున్ని స్మరించుకుంటూ నమస్కారాలు చేసుకున్నారు. మహానేత సమాధికి అలంకరించిన పుష్పాలను గుర్తుగా విద్యార్థినిలు చేతబట్టి అతి జాగ్రత్తగా తీసుకెళ్లారు. పల్లెబడులలో చదివిన తమకు ఉన్నత విద్యను అందించేందుకు కృషి చేసిన దివంగత ముఖ్యమంత్రికి వారు ఘనంగా నివాళులర్పించడం విశేషం.
ప్రత్యేక వాహనాలలో తరలివచ్చిన అభిమానులు
వైఎస్ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతి కార్యక్రమానికి తెలంగాణ జిల్లాలతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేక వాహనాలతో తరలివచ్చారు. శనివారం సాయంత్రమే ఇడుపులపాయకు బయలుదేరిన వారు ఆదివారం చేరుకున్నారు. నేరుగా వైఎస్ ఘాట్ వద్దకు వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, విజయవాడ, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి మహానేత ఘాట్‌ను దర్శించుకునేందుకు బారులు తీరారు.
అనంతపురం జిల్లా నుంచి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎల్‌ఎం మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్ మాల ధరించిన అభిమానులు పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే విధంగా వైఎస్ సమాధి చెంతన ఇరుముడులు చెల్లించారు. మహానేత లేకపోతే తమకు ప్రాణాలు దక్కేవి కావని, ఆరోగ్యశ్రీ ద్వారా లబ్దిపొందిన లబ్దిదారులు కన్నీటి పర్యంతమయ్యారు.
అమ్మకోసం ఎదురు చూపులు
అదే అభిమానం...అదే ఆనందం...ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాజు వైఎస్ విజయమ్మను చూడగానే అభిమానులు ఉప్పొంగిపోయారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తృతీయ వర్దంతిసందర్బంగా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది ఆదివారం ఇడపులపాయకు చేరుకున్నారు. తమ అభిమాన నేత వైఎస్‌కు నివాళులర్పించిన వారు వైఎస్ విజయమ్మను పలుకరించేందుకు ఆరాటపడ్డారు. భర్తను పోగొట్టుకుని, కుమారుడు జైలు గోడల మధ్య ఉండగా ఆ తల్లి వేదన వర్ణణాతీతమని, తామున్నామంటూ పలుకరించేందుకు పోటీపడ్డారు. ఈ కష్టాలు ఎంతోకాలం నిలువవంటూ ఓదార్పునిచ్చే మాటలను చెబుతూ వచ్చారు. విజయ మ్మ పలుమార్లు వారి చెంతకు వచ్చి అభివాదం చేశారు.
6
ఇడుపులపాయలో బస చేసిన విజయమ్మ
ఇడుపులపాయ, న్యూస్‌లైన్: మహానేత, దివంగ త ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమ ణి, వైఎస్‌ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు, పులివెం దుల ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ ఆదివారం రా త్రి ఇడుపులపాయలోనే బస చేశారు. మహానేత మూడవ వర్ధంతి సందర్భంగా ఒక్కరోజు ముం దుగానే శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.విజయమ్మ రెండవ రోజు ఆదివారం కూడా ఇడుపులపాయలోనే ఉన్నారు. మహానేత వైఎస్‌ఆర్ త రహాలోనే ఇడుపులపాయలో విజయమ్మ రెండ వ రోజు కూడా బస చేశారు. వైఎస్‌ఆర్ కూడా ఇ డుపులపాయకు వస్తే దాదాపు రెండు రోజుల పాటు బస చేసేవారు. అంతేకాకుండా ఆ మహా నేత మరణించి మూడేళ్లు కావస్తుండటంతో విజయమ్మ ఇడుపులపాయలోనే బసచేశారు.

No comments:
Post a Comment