టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న అవకాశవాద రాజకీయాలు తనకు నచ్చలేదని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. 30 సంవత్సరాల పాటు టీడీపీకి సేవలందించినా తనకు తగిన గుర్తింపు రాలేదని వాపోయారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు యువనేత వైఎస్ జగన్ ద్వారానే అమలవుతాయని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. వచ్చే నెల 11న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=468835&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=468835&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment