వరంగల్ : కేవలం ఓడిపోతామనే భయంతోనే టిఆర్ఎస్ పార్టీ నీచాతి నీచమైన రాజకీయాలు చేస్తోందని పరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. 15రోజుల కిందట ఒక వృద్దురాలిని కలిసి ఓటు అడిగిన విజువల్స్‌కు, మరికొన్నింటిని కలిపి కొన్ని ఛానెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నిజాయితీగా ఎదుర్కొనే దమ్ములేకే అడ్డుదారులు తొక్కుతున్నాయన్నారు. దీనిపై ఈసికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. ఓటమి భయంతోనే టిఆర్ఎస్ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని ఎమ్మెల్సీ కొండామురళి ఆగ్రహం వ్యక్తంచేశారు. |
Wednesday, 6 June 2012
ఓటమి భయంతోనే నీచ రాజకీయాలు: సురేఖ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment