మంత్రి మోపిదేవి వెంకట రమణ విషయంలో "సాక్షి" చెప్పిందే నిజమైంది. ఆయన రాజీనామా లేఖలో రాసినదానికి, బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నదానికి పోలికే లేదు. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని అపఖ్యాతి పాలుచేసేందుకు మోపిదేవి రాజీనామాను వాడుకున్నారని "సాక్షి" చేస్తున్న వాదనకు పక్కా ఆధారాలు లభించాయి. అసలు ఈ రాజీనామా లేఖ రూపకల్పనలో పిసిసికి చెందిన కీలక నేత పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వాడరేవు-నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్-"వాన్‌పిక్" వ్యవహారంలో అసలు నిజం వెలుగుచూస్తోంది. ఈ వ్యవహారంలో గతనెల 24న మోపిదేవిని సీబీఐ అరెస్ట్ చేసింది. అదే రోజున మోపిదేవి రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపించారు. వాన్‌పిక్ ఫైల్ మీద ఎటువంటి పరిస్థితుల్లో తాను సంతకం చేయాల్సి వచ్చిందో మోపిదేవి వివరించారు.
"ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత ఫైల్స్ నా కార్యాలయానికి రాకున్ననూ, వారి కార్యాలయానికి పిలిపించి, వారి కార్యదర్శి సమక్షంలో సంతకాలు చేయడం జరిగింది." అనే కారణాన్ని మోపిదేవి చెప్పుకున్నారు. అయితే సీబీఐ కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్‌లో మోపిదేవి ఇందుకు విరుద్ధంగా చెప్పారు. ఇందులో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. ప్రస్తావనే లేదు.
"సహాయ కార్యదర్శి, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి తదితరులు ప్రతిపాదనలు రూపొందించి పంపితే, దాన్ని మంత్రివర్గం ముందు ఉంచాను. రాయితీకి సంబంధించిన ఒప్పందం మంత్రివర్గంలోని అందరికీ తెలుసు. అంతా చర్చించాకే నిర్ణయం వెలువడింది." అని బెయిల్ పిటిషన్‌లో మోపిదేవి వెల్లడించారు.
రాజీనామా లేఖలో చెప్పిన విషయానికి, బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయానికి చాలా తేడా ఉంది. సీఎం వై.ఎస్. ఆదేశాల మేరకే సంతకం చేశానని రాజీనామా లేఖలో చెప్పిన మోపిదేవి వెంకటరమణ, అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు పంపింతే, దాన్నిమంత్రి మండలి ముందు ఉంచానని చెప్పారు. అంటే రాజీనామా లేఖలో మహానేతపై మోపిదేవి అభాండాలు మోపినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. మోపిదేవికి రక్షించడానికి మహానేతపై బురదజల్లుతున్నారన్నది కళ్లముందు కనిపిస్తోన్న కఠోర వాస్తవం. ఇదే విషయాన్ని సాక్షి మొదటి నుంచి చెబుతూ వస్తోంది.

No comments:
Post a Comment