వైఎస్సార్ వల్ల అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు నిరూపిస్తే వరంగల్ వదిలి వెళ్లిపోతామని కొండా సురేఖ అన్నారు. తెలంగాణను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగెత్తిందని ఆరోపించారు. వరంగల్ జిల్లా పరకాలలో శుక్రవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ వైఎస్ ను విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. పదకొండేళ్లలో ఏం సాధించారని టీఆర్ఎస్ నాయకులను ఆమె ప్రశ్నించారు. టీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలు ఏంచేస్తోందని విమర్శించారు. తాను టీఆర్ఎస్ లా డబ్బులు పంచలేదన్నారు. టీఆర్ఎస్ మోసపూరిత మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈనెల 12న జరగనున్న ఉప ఎన్నికల్లో తనను గెలిపించాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
Friday, 8 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment