మానవతా విలువల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు
సొంత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ద్రోహం చేసిన చరిత్ర ఆయనది
అనారోగ్యంతో ఉన్న తండ్రిని పట్టించుకోలేదు
తల్లి ఆలనాపాలనా చూడలేదు
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని విజయమ్మ సరిగా పెంచలేదంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విష ప్రచారం చేస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ పెంపకం వల్లే జగన్‌ను నేడు రాష్ట్రవ్యాప్తంగా జనం ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. మానవత్వం, విలువల గురించే మాట్లాడే అర్హత, నైతికత చంద్రబాబుకు లేవని దుయ్యబట్టారు. సొంత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వివరిస్తూ... ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘చంద్రబాబు తండ్రి ఖర్జూరపు నాయుడుకు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో పెద్ద ఆపరేషన్ జరిగింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తండ్రిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఆసుపత్రికి వెళ్లి కేవలం పది నిమిషాల వ్యవధిలోనే వెనుతిరిగిన ప్రబుద్ధుడు ఈయన. ఇది వాస్తవం కాదా బాబు?’’ అని నల్లపురెడ్డి ప్రశ్నించారు. ‘‘ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత తల్లి అమ్మణ్ణమ్మను హైదరాబాద్‌లోని మీ ఇంట్లో కనీసం పది రోజులైనా పెట్టుకొని ఆలనా పాలనా చూశారా?’’ అని నిలదీశారు. ఇలాంటి వ్యక్తికి విజయమ్మను విమర్శించే నైతిక హక్కుందా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘అంతేకాదు.. 1999లో తమ్ముడు రామ్మూర్తినాయుడు, మీ తల్లి ఇద్దరూ.. మీరు చేసిన నిర్వాకానికి దూరమయ్యారు.
మీ తమ్ముడు చిత్తూరు జిల్లాలో మీ మీదే పోటీచేశారు. మీ తల్లి రామ్మూర్తినాయుడుకు అనుకూలంగా.. మీకు వ్యతిరేకంగా ‘ఈనాడు’ పత్రికలో ప్రకటన ఇచ్చేందుకు ఆ పత్రికకు డబ్బులు చెల్లించిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత పత్రిక యాజమాన్యంతో మాట్లాడి ఆ ప్రకటన రాకుండా నిలుపుదల చేసింది నిజం కాదా?’’ అని ఆయన నిలదీశారు. అమ్మమ్మ చనిపోతే భౌతికకాయాన్ని కూడా చూడని చంద్రబాబు మానవతా విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు తన తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకున్నారో నారావారి పల్లెలో ప్రతి గడపకూ తెలుసన్నారు. ‘‘బాబు లాంటి దరిద్రుడ్ని ఎందుకు కన్నానో అని అమ్మణ్ణమ్మ కన్నీరు పెట్టుకున్న మాట వాస్తవం కాదా?’’ అని ప్రసన్న సూటిగా ప్రశ్నించారు. మానవ విలువలను లెక్కగట్టే చంద్రబాబు మరోసారి విజయమ్మను విమర్శిస్తే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

No comments:
Post a Comment