ఐదు రోజుల సీబీఐ కస్టడీ ముగిసిన నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య ఎదుట హాజరుపర్చారు. కస్టడీలో సీబీఐ అధికారులు ఏమైనా ఇబ్బందులకు గురిచేశారా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించగా...అలాంటిదేమీ లేదని జగన్ సమాధానం ఇచ్చారు. ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా... ఏమీ లేదని జగన్ చెప్పారు. ఈనెల 11తో రిమాండ్ ముగియడంతోపాటు రెండవ, మూడవ చార్జిషీట్లలో జగన్‌ను హాజరుపర్చాలని ఇప్పటికే పీటీ వారంట్ జారీచేసిన నేపథ్యంలో 11న జగన్‌ను హాజరుపర్చాలని న్యాయమూర్తి జైలు అధికారులను ఆదేశించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment