ఉప ఎన్నికల తరువాత తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి చెప్పారు. సిఎల్ పిలో ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రి కోమిటిరెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తరువాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఉపఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమవుతారని చెప్పారు. మద్యం సిండికేట్ విషయంలో ఎమ్మెల్యే కవితకు నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. సిండికేట్‌తో తనకు సంబంధంలేదని కవిత గతంలోనే స్పష్టం చేశారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment