తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరకాల అభ్యర్థి కొండా సురేఖ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శుక్రవారం గీసుకొండలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక పాత్ర పోషించేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని కొండా సురేఖ అన్నారు. అమర వీరుల కుటుంబాలకు తాము ఆర్థిక సాయం చేశామని, టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి ప్రజలకు ఏంచేశారని ఆమె ప్రశ్నించారు. ఎన్నారైలు సైతం పరకాల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. 13 ఏళ్లగా ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న తనకు ఓటు వేసి గెలిపించాలని సురేఖ ఓటర్లను కోరారు.

No comments:
Post a Comment