వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం ఈరోజుకు పూర్తి అయింది. సిబిఐ కోఠి కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జగన్ ని విచారించారు. జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులకు సంబంధించి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. అనంతరం జగన్ ని చంచల్ గూడ జైలుకు తరలించారు. రేపు కూడా సిబిఐ అధికారులు జగన్ ని విచారిస్తారు.
సిబిఐ కోరిన మీదట హైకోర్టు జగన్ ని రెండు రోజులు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో మొదటి రోజు విచారణ ఈరోజు ముగిసింది. రేపటితో రెండవ రోజు విచారణ ముగుస్తుంది.
సిబిఐ కోరిన మీదట హైకోర్టు జగన్ ని రెండు రోజులు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో మొదటి రోజు విచారణ ఈరోజు ముగిసింది. రేపటితో రెండవ రోజు విచారణ ముగుస్తుంది.
No comments:
Post a Comment