కావలి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, కుమార్తె షర్మిలా వస్తున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి జనసునామీ వచ్చినట్లుంది. మెయిన్ బజారుతోపాటు వీధులన్నీ జనంతో నిండిపోయాయి. వారిద్దరినీ చూసేందుకు, వారి ప్రసంగాలు వినేందుకు జనం మేడలపైన, మిద్దెలపైన, గోడలు, రేకుల షెడ్లపైన ఎక్కారు. కావలి ప్రధాన కూడలి నుంచి ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు.
ప్రచార వాహనంపైన విజయమ్మ, షర్మిలతోపాటు పార్టీ లోక్ సభ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర రెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.

No comments:
Post a Comment