పరకాలలో టీఆర్ఎస్ పార్టీ నోట్లతో ప్రజలను ప్రలోభపెడుతోంది. కేసీఆర్ సభకు జన సమీకరణ కోసం ఆపార్టీ కార్యకర్తలు శనివారం డబ్బులు పంచుతూ సాక్షి కెమెరాకు చిక్కారు. అనంతరం ఈ విషయాన్ని గమనించిన వారు అక్కడ నుంచి జారుకున్నారు. పరకాలలో ఈరోజు సాయంత్రం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.
శవ రాజకీయాలు చేసింది కేసీఆరే: గోనె
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ శవ రాజకీయాలు చేస్తుంది కేసీఆరేనని, అమాయకులైన 800మంది మృతికి కేసీఆరే కారణమన్నారు.
పరకాలలో కొండా సురేఖ గెలుపు అవకాశాలను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా టీఆర్ ఎస్‌కు మద్దుతు ఇస్తోందని గోనె ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా కాంగ్రెస్ నేతలకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారముందని ఆయన వెల్లడించారు. ఒక్కో ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీతో పొత్తు పెట్టుకుంటూ తెలంగాణ ప్రజల మనోభావాలను తాకట్టు పెడుతున్న కేసీఆర్, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు.

No comments:
Post a Comment