పరకాల: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడూ ప్రజల కోసమే తపించారని షర్మిల అన్నారు. జగన్‌అన్న ప్రజల సమస్యను తన సమస్యగా భావించి స్పందించారని ఆమె చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా పరకాల నియోజిక వర్గంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో షర్మిలమ్మ ఉద్వేగంగా ప్రసంగించారు. వైఎస్సార్‌కు తెలంగాణ ప్రజలంటే ఎంతో ప్రేమ, అభిమానమని వైఎస్ విజయమ్మ చెప్పారు. హన్మకొండ నుంచి పరకాలకు చేరకున్న వైఎస్ విజయమ్మ, షర్మిలమ్మకు అడగడుగునా ఆడపడుచుల అశీర్వచనాలతో.. జన నీరాజనాలు పలికారు. ఈ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో జనం పాల్గొనడంతో పరకాల జనసంద్రమైంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment