తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేలా ఈనాడులో ప్రచురించిన వార్తను పెయిడ్ న్యూస్‌గా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు విడుదల చేసిన కరపత్రాన్ని యథాతథంగా ప్రచురించి ఆ పార్టీ అభ్యర్థులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించినందున, ఆ వార్తను పెయిడ్ న్యూస్‌గా పరిగణించి కోటి రూపాయలను టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులో చూపాలని కోరింది.
శనివారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్, ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, సీనియర్ నేత విశ్వేశ్వర్‌రెడ్డి కలిసి ఈమేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం జనక్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. జగన్‌ను ఎదుర్కొనే సత్తాలేక టీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజాభిమానం ముందు నిలవలేరన్నారు.
చదలవాడను తప్పించండి
తిరుపతిలో మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని ఎన్నికల నుంచి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈసీని కోరారు. తిరుమలలో సంతకం చేయనందునే వైఎస్ చనిపోయారని, జగన్ జైలు పాలయ్యారని వ్యాఖ్యానించి కోడ్ ఉల్లంఘించారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను ప్రచారం చేయకుండా అక్రమంగా అరెస్టు చేస్తున్నారని సీఈవో దృష్టికి తెచ్చారు.

No comments:
Post a Comment