* పేదల గురించి ఆలోచించిన వైఎస్‌ను ముద్దాయిని చేశారు: విజయమ్మ
* వైఎస్ పథకాలను తుంగలోకి తొక్కారు
* ప్రజల మన్నన లేని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి
* ప్రజారంజకమైన వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందాం
* ఒంగోలు, కావలి, నెల్లూరులో ప్రచారం
నెల్లూరు, ఒంగోలు, న్యూస్‌లైన్: ‘‘ప్రతిక్షణం రాష్ట్రం బాగు గురించి ఆలోచించి, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దివంగత నేతను సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి ముద్దాయిని చేశారు.. ప్రజలు అభిమానిస్తున్నందుకు ఆయన కొడుకు జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టారు.. వైఎస్ తన రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ను అటు కేంద్రం.. ఇటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తే.. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు అదే పార్టీ నేతలు వైఎస్‌ను నిందిస్తున్నారు.. మా కుటుంబాన్ని వేధిస్తున్నారు...’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ తుంగలోకి తొక్కుతున్న ప్రభుత్వాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లపాటు ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా అభివృద్ధి, సంక్షేమాలే రెండు కళ్లుగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజారంజక పాలన అందించారని చెప్పారు. ప్రజల మన్నన లేని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి మళ్లీ సువర్ణయుగం తెచ్చుకోవాలన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం ఆమె నెల్లూరు లోక్‌సభ పరిధిలోని నెల్లూరు, కావలిలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఉదయగిరి బ్రిడ్జి సెంటర్, నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్‌లలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. విజయమ్మతోపాటు జగన్ సోదరి షర్మిల కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పలుచోట్ల విజయమ్మ చేసిన ప్రసంగం ఆమె మాటల్లోనే...
వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు..
వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు ఇలా అందరి గురించి ఆలోచించి, వారికి అవసరమైన పథకాలు ప్రవేశ పెట్టారు. కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అన్నదాతను నిర్లక్ష్యం చేస్తోంది. గతేడాది కరువు. తర్వాత వరదలొచ్చి అన్నదాత నిలువునా కూలిపోతే... పరిహారం ప్రకటించారుగానీ ఇప్పటిదాకా పైసా కూడా ఇచ్చి అదుకోలేదు. రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో ఇచ్చిన రెండే రెండు హామీలు.. ఉచిత విద్యుత్‌ను 7 నుంచి 9 గంటలు పెంచడం, పేదలకు 30 కేజీల బియ్యం ఇవ్వడం. ఈ రెండు హామీలను కూడా ఈ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆయన డాక్టర్ కాబట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదల ప్రాణాలు కాపాడారు. కానీ ఈ ప్రభుత్వం 139 వ్యాధులను పథకం నుంచి తొలగించింది.
పేద విద్యార్థులకు ఉన్నత చదువు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200కు పెంచారు. డ్వాక్రా సంఘాల మహిళలకు అభయహస్తం అందించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారు. కుల, మతాలకతీతంగా అర్హులైన పేదలందరికీ పథకాలు అందాలని ఆశించారు. కానీ ఇప్పుడు ఆ పథకాలన్నింటి కీ తూట్లు పొడుస్తున్నారు. ప్రతిక్షణం రాష్ట్రం బాగు గురించి ఆలోచించిన నేతను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.. ఆయన కొడుకైనందుకు, జనం మనసులో ఉన్నందుకు జగన్‌మోహన్‌రెడ్డి జైల్లో పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు రావాలనుకోవడమే రాజశేఖరరెడ్డి చేసిన తప్పా?
సీబీఐకి ఎందుకింత కక్ష సాధింపు..?
ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి ఇష్టం లేదు. నల్లకాలువలో ఇచ్చిన మాట కోసం జగన్‌బాబు ఓదార్పుయాత్ర చేపట్టారు. ఇది ఇష్టంలేని కాంగ్రెస్ కోర్టులో కేసు వేయించింది... హైకోర్టు జగన్ ఆస్తులపై విచారణకు ఆదేశించిన 24 గంటల్లోనే 28 బృందాలతో జగన్ ఆస్తులపై దాడులు చేయించింది. బోఫోర్స్ కేసులో రాజీవ్, సోనియా గాంధీల ఇళ్లపై ఇలా దాడులు చేశారా? 170 మంది ఎంపీలపై కేసులున్నాయట.. వారిపై దాడులు చేసిందా? మంత్రులపై సీబీఐ విచారణ జరుగుతుంది.. మరి వారి ఇళ్లపై ఇలా దాడులు చేయలేదే? రోశయ్యపై ఏసీబీ కేసు ఉంది.. దాడులు చేయలేదు సరి కదా.. గవర్నర్ పదవి ఇచ్చారు.
బొత్స సత్యనారాయణపై వోక్స్‌వ్యాగన్ కేసులో ఇలా దాడులు చేయలేదు ఎందుకు? చంద్రబాబు నాయుడు భూ కేటాయింపులు సీబీఐకి కనిపించవు... ఆయనపై విచారణ చేయరు. సాక్షి షేరు రూ.370కు అమ్మితే తప్పు కానీ ..ఈనాడు షేరు రూ.5.20 లక్షలకు అమ్మితే సీబీఐకి తప్పుగా కనిపించదు. 10 నెలలుగా కక్షకట్టి కుట్రతో జగన్ సన్నిహితులు, సంబంధీకులు, ఆయన సంస్థల్లో పనిచేస్తున్న వారిని 2 వేల మందిని విచారించింది. కానీ ఏమీ సాధించలేకపోయింది. అంతెందుకు ఈ రోజు కూడా కోర్టు సీబీఐ తీరును తప్పుపట్టింది. 10 నెలల విచారణలో ఏం సాధించారని ప్రశ్నించింది. జగన్, వైఎస్‌లపై సీబీఐకి ఎందుకు ఇంత కక్ష? సీఐబీ పనితీరు తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ కుట్టినట్లు ఉంది.
వైఎస్ మృతిపై అనుమానాలున్నాయి
వైఎస్ మృతిపై నేను అనడం కాదు.. రాష్ట్ర ప్రజలతో పాటు రష్యా మీడియా కూడా 2009 సెప్టెంబర్ 3వ తేదీనే అనుమానాలు వెలిబుచ్చింది. అనేక టీవీ చానళ్లు, విద్యావంతులు సందేహాలు వ్యక్తం చేశారు. వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఆరోజు వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో రూట్ మ్యాప్ లేదంటున్నారు. పైలట్, కోపైలట్ మాట్లాడిన 7 నిమిషాలే బ్లాక్‌బాక్స్‌లో రికార్డు అయ్యిందంటున్నారు. వెస్లీ గన్‌లో బుల్లెట్లు ఏమయ్యాయో చెప్పాల్సిన అవసరం ఉంది. హెలికాప్టర్‌కు వాతావరణం అనుకూలించకపోతే పైన అలాగే నిలిపివేసే అవకాశం ఉన్నా ఎందుకు నిలపలేదో తెలియాల్సి ఉంది. ఇవి ఎవరినో అనుమానించడానికి చేస్తున్న ఆరోపణలు కాదు. వీటికి సమాధానాలు చెప్పాలని అడుగుతున్నాం. ప్రజలు కూడా ఈ విషయంమీద నిలదీయాల్సిన అవసరం ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రిని జగన్ కలిసి బ్లాక్‌బాక్స్‌ను బయటపెట్టాలంటే ససేమిరా అన్నారు.
మీ ఓటు వారికి గుణపాఠం కావాలి..
ఈనాడు ఇంత దుర్మార్గంగా వైఎస్‌ఆర్‌ను మేమే చంపామంటున్నారు. జగన్‌కు, నాకు అధికార దాహం అంటున్న వారు ఒక్కటి గమనించాలి.. నేను ఏరోజైనా రాజకీయాల్లో ఉన్నానా..? నన్ను ఏ రోజైనా రాజకీయ నాయకురాలిగా మీరు చూశారా? వైఎస్సార్ మరణం తరువాత 150 మంది ఎమ్మెల్యేలు జగన్‌ను సీఎం చేయడానికి ముందుకు వచ్చారు. అధిష్టానం మాటకు గౌరవం ఇచ్చి రోశయ్యను సీఎం చేసినా అభ్యంతరం చెప్పలేదు. వైఎస్‌కు అసెంబ్లీలో సంతాపం చెప్పడానికి కాంగ్రెస్ వాళ్లకు రెండు నెలలు పట్టింది. వైఎస్ బతికున్నప్పుడు దండం పెట్టినవారే ఇప్పుడు ఆయన్ను దోషి అనడం చూస్తుంటే బాధగా ఉంది. జగన్‌ను జైల్లో పెడితే ఒకట్రెండు సీట్లయినా గెలుచుకోవచ్చని రాజకీయం చేసిన వారికి మీ సత్తా తెలియాలి. మీరు ఫ్యాను గుర్తుపై వేసే ప్రతి ఓటు ఈ ప్రభుత్వాలకు గుణపాఠం కావాలి.

No comments:
Post a Comment