వరంగల్ జిల్లా పరకాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచార సభకు జనం పోటెత్తారు. విజయమ్మ, షర్మిలను చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. రహదారులన్ని జనంతో నిండిపోయాయి. ఎటు చూసినా జనమే కనిపించారు. హన్మకొండ నుంచి పరకాలకు బయల్దేరిన విజయమ్మకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ ఉదయం గీసుకొండ నుంచి రోడ్ షో ప్రారంభించిన విజయమ్మ, షర్మిలకు పరకాల నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment