వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శనివారం నెల్లూరు లోక్‌సభ పరిధిలో రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ నెల 4వ తేదీన ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వింజమూరు, జలదంకి, కలిగిరిలతో పాటు లోక్‌సభ పరిధిలోని ఆత్మకూరులో కుమార్తె షర్మిలతో కలిసి విజయమ్మ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోలకు ఊహించిన దాని కంటే రెట్టింపు స్థాయిలో ఆదరణ లభించింది. పార్టీ శ్రేణుల్లో మెజారీటీపై మరింత ధీమా పెంచింది.
ఇంకా సూటిగా చెప్పాలంటే విజయమ్మ పర్యటన తర్వాత కాంగ్రెస్, టీడీపీ డిపాజిట్ల కోసం భారీ కసరత్తు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విజయమ్మ నెల్లూరు లోకసభ పరిధిలో మరోసారి ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీల్లో నిరుత్సాహం అలుముకుంది. మహానేత కుటుంబంపై అధికార కాంగ్రెస్ చూపుతున్న కక్షసాధింపునకు టీడీపీ సహకరిస్తున్న విధానాన్నే ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారి ప్రసంగాల తర్వాత తిరుగు ముఖంలో ఎవరి నోట విన్నా ఇదే చర్చ సాగుతోంది.
విజయమ్మ శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు ఒంగోలు నుంచి కావలి చేరుకుంటారు. పట్టణంలోని జెండా చెట్టు వద్ద నుంచి ఆర్‌ఎస్‌ఆర్ కల్యాణ మండపం వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఉదయగిరి బ్రిడ్జి వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు చేరుకుని, నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి రోడ్ షో ప్రారంభిస్తారు. కనకమహల్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ చేరుకుని అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వీఆర్‌సీ సెంటర్ నుంచి ట్రంక్ రోడ్డు మీదుగా మేకపాటి అతిథి గృహానికి చేరుకుంటారు.

No comments:
Post a Comment