గీసుకొండ: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి మనమధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పట్టించుకున్ననాథుడే కరవయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సీమాంధ్రతో సమానంగా తెలంగాణను అభివృద్ది చేయాలని మహానేత ప్రయత్నించారని చెప్పారు. ఫించన్లు ఇచ్చి వృద్ధులకు వైఎస్సార్ పెద్ద కొడుకు అయ్యారని అన్నారు. పరకాల నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రచారం భాగంగా గీసుకొండలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్ షోలో విజయమ్మ ప్రసంగించారు.
తన కుమారుడు జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టారని అన్నారు. జగన్ బయటవుంటే ఉప ఎన్నికల్లో 18 సీట్లు గెలిపించుకుంటాడనే కుట్రతోనే ఆయనను జైలు పాలుచేశారన్నారు. రాజశేఖరరెడ్డి కొడుకు కావడమే జగన్ చేసినా తప్పా అంటూ సూటిగా ప్రశ్నించారు. తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ తన కుమారుడికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయిందన్నారు. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోనే 28 సీబీఐ బృందాలు రంగంలోకి దిగాయని గుర్తు చేశారు. రెండు వేల మంది ఫోన్లు టాప్ చేసిందని తెలిపారు. మహానేత మరణంపై తమకు అనుమానాలున్నాయని, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో తాము ప్రజల ముందుకు రావాల్సివచ్చిందన్నారు.
కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన అతికొద్ది మందిలో కొండా సురే్ఖ ఒకరని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఆమెతో గేమ్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన సురేఖను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 78 మంది ప్రాణాలు వదిలారని అన్నారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను గౌరవిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీర్మానం చేసిన సంగతిని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు, వైఎస్సార్ కోసం మరణించిన వారికి నిమిషం పాటు మౌనం పాటించి విజయమ్మ సంతాపం తెలిపారు.

No comments:
Post a Comment