తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడైనా పేదల గురించి ఆలోచన చేశారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలల పథకం అన్నారు. చంద్రబాబుకు మాటల్లో ఉన్న ఆందోళన చేతల్లో ఉండదని విమర్శించారు.
వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం చంద్రబాబు ధర్నా చేయడం సంతోషమేనన్నారు. అయితే చంద్రబాబు వైఎస్ పథకాలకు ప్రత్యామ్నాయం లేదని బహిరంగంగా ఒప్పుకోవాలన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ మేనిఫెస్టోలో ఫీజు రీయింబర్స్ పథకం ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంక్షోభంపై మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఆహ్వానించతగ్గదేనని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

No comments:
Post a Comment