ఆదిలాబాద్: సింగరేణి బొగ్గుగనుల్లో ఐఎన్టీయూసీకి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాంపల్లి సమ్మయ్య రాజీ నామా చేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు పరకాలలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంపల్లి సమ్మయ్య తెలిపారు. మహానేత వైఎస్ఆర్ తనయుడు జగన్ ను కాంగ్రెస్ పార్టీ వేధిస్తున్నందుకే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సమ్మయ్య వైఎస్ఆర్ సీపీలో చేరడం హర్షణీయమని పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment