ఈ నెల 8,9 తేదీలలో పరకాలలో ప్రచారం నిర్వహించనున్న తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు తగిన భద్రత కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ నేతలు ఈ రోజు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ ని కలిశారు. ప్రచారాన్ని అడ్డుకుంటామంటూ టీఆర్ఎస్ సహా కొన్ని సంస్థలు ప్రకటించాయి. ప్రచారం సజావుగా సాగేలా భద్రత కల్పించాలని వారు కోరారు.
ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డిపైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశారు. జగన్ జైలుకు వెళ్లాడంటూ బాబు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారని వారు ఇసి దృష్టికి తీసుకువెళ్లారు.
విజయమ్మ భద్రతపై డీజీపీ, వరంగల్ ఎస్పీలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

No comments:
Post a Comment