ఆళ్లగడ్డ: 25 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్‌ను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి తెచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పేద ప్రజల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశ సంక్షేమ పథకాలపై కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విజయమ్మ ఆరోపించారు. ఆళ్లగడ్డ రోడ్‌షోలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. పేదల కోసం పెట్టిన ఆరోగ్యశ్రీ కూడా సక్రమంగా అమలుకావడం లేదని అన్నారు
పరిశ్రమలను స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని వైఎస్ ఆకాంక్షించారని ఆమె అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బాబు ఎమ్మార్‌కు ఖరీదైన భూములు కట్టబెట్టారని.. దీనిపై సీబీఐ ఎందుకు విచారణ జరపడం లేదని విజయమ్మ ప్రశ్నించారు. జగన్ 2003 నాటికే సండూర్ పవర్ కంపెనీ ప్రారంభించారని, తన పరిశ్రమల కోసం ఏ మంత్రిని, అధికారులతోనూ మాట్లాడలేదని.. అటువంటి జగన్‌పై ఎలా విచారణ జరుపుతారుని వైఎస్ విజయమ్మ అన్నారు.

No comments:
Post a Comment