జగన్ కేసులో హైకోర్టు చెప్పిన 24 గంటల్లోగానే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది
అదే చంద్రబాబుపై కోర్టు చెప్పి నెల రోజులైనా దర్యాప్తు మొదలుపెట్టలేదు
కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మ.. ఈ విషయం
ఆ సంస్థ మాజీ డెరైక్టరే చెప్పారు
జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడమే నిమ్మగడ్డ ప్రసాద్ చేసిన తప్పా?
వైఎస్ హయాంలో రూ.లక్ష కోట్లు అవినీతి అన్నది చంద్రబాబు చేసిన అభూత కల్పన

అనంతపురం/రాయదుర్గం, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మ. కాంగ్రెస్ ఆడిస్తుంది.. సీబీఐ ఆడుతుంది. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సీబీఐ పనిచేస్తుందని స్వయంగా ఆ సంస్థ మాజీ డెరైక్టర్ జోగీందర్ సింగేఅంగీకరించారు. జగన్ బాబుపై కేసు విషయంలో హైకోర్టు చెప్పిన 24 గంటల్లోపే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. మా ఇళ్లలోనూ, కంపెనీల్లోనూ, మా స్నేహితులు, బంధువుల ఇళ్లలోనూ.. పెట్టుబడి పెట్టిన వారి ఇళ్లలోనూ 28 బృందాలతో సీబీఐ సోదాలు చేయించింది. ‘సాక్షి’ కార్యాలయంలోనైతే దాదాపు 700 మందితో రైడ్ చేసి.. సోదాలు చేశారు. అంటే.. జగన్‌బాబు విషయంలో సీబీఐ ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
అదే చంద్రబాబుపై నేను వేసిన కేసులో నెలరోజుల్లోగా దర్యాప్తు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించినా.. ఆ నెల రోజులపాటూ సీబీఐ ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అంటే చంద్రబాబుకో న్యాయం.. జగన్‌బాబుకో న్యాయమా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ.. సీబీఐని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రలో భాగంగానే జగన్‌పై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని ఆమె ఉద్ఘాటించారు. జగన్ విషయంలో సీబీఐ దూకుడు.. మిగతా కేసుల్లో లేదేమని నిలదీస్తూ.. ‘బోఫోర్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇళ్లలో సోదాలు చేయలేదే? ఫోక్స్‌వ్యాగన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణ ఇంటిపై దాడులు చేయలేదే? 26 జీవోలు జారీ చేసిన మంత్రుల ఇళ్లపై దాడులు చేయలేదే? ఏసీబీ కేసులో రోశయ్య ఇంట్లో సోదాలు చేయలేదే?’ అని ఆమె ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల అనంతపురం నగరం, రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం, డీహీరేహాళ్ మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించి ప్రసంగించారు. విజయమ్మ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
పెట్టుబడులు పెట్టినందుకు వేధిస్తున్నారు

కేవలం జగన్‌బాబు సంస్థల్లో పెట్టుబడి పెట్టారన్న ఏకైక కారణంతోనే నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రెండున్నరేళ్లుగా జగన్‌బాబునే కాదు.. జగన్‌బాబుకు సన్నిహితంగా ఉన్న వారిని, పెట్టుబడులు పెట్టిన వారిని వేధిస్తూనే ఉన్నారు. జగన్ ఆస్తులపై తొమ్మిది నెలలుగా సీబీఐ ఎంక్వైరీ చేస్తోంది. ఏనాడూ జగన్‌ను పిలిచి విచారించలేదు. మే 28న తన ముందు హాజరు కావాలని జగన్‌బాబుకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఇంతలోనే 25వ తేదీన తన ముందు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్‌ను ప్రజలకు దూరం చేసి.. మూడు రోజులపాటు విచారించింది. జగన్‌బాబు వాళ్ల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పారు. అయితే వారు చెప్పమన్నట్లు చెప్పలేదు. దీంతో విచారణకు సహకరించడం లేదని చెప్పి 27న అరెస్టు చేశారు. రెండేళ్లుగా ప్రజల మధ్యే తిరుగుతున్న జగన్ బాబును మీ నుంచి దూరం చేయకపోతే.. ఉప ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం కూడా దక్కదేమోనన్న భయంతో కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఈ కుట్ర చేశాయి. వారి కుట్రలు, కుతంత్రాలు ప్రజల ప్రేమ ముందు కొట్టుకుపోతాయ్.
జగన్‌బాబు అవినీతిపరుడా?
వైఎస్ రాజశేఖరరెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్‌బాబు అవినీతికి పాల్పడ్డారంటున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు జగన్‌బాబేమైనా ప్రభుత్వంలో ఉన్నాడా? జగన్ ఏనాడు సీఎం క్యాంపు కార్యాలయానికి కూడా వెళ్లలేదు. సెక్రటేరియెట్‌కు కూడా వెళ్లలేదు. ఏ మంత్రికీ.. ఏ అధికారికీ ఫోన్ కూడా చేసింది లేదు. ఒకవేళ ఫోన్ చేసినట్టు ఉంటే ఆధారాలు చూపించండి. తనకుండే వ్యాపారాలు తనకున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు సీఎం కాక ముందే జగన్‌బాబు పారిశ్రామికవేత్త. 2003 క్రిస్మస్(డిసెంబర్ 25) రోజున కర్ణాటకలో జగన్‌బాబు 35 మెగావాట్ల సామర్థ్యంతో సండూర్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. మరో పవర్‌ప్లాంట్ కూడా ఉంది. కరీంనగర్ జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్ కూడా ఉంది.
వైఎస్ రాజశేఖరరెడ్డిగారు సీఎం అయ్యాక జగన్‌బాబు పారిశ్రామికవేత్తగా మారాడని చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు చెప్పడంలో అర్థం లేదు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌బాబు మీదే వేస్తున్నారు. ఇటీవల గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ వస్తే, ఆ జడ్జికి లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తే.. అది ఇచ్చింది జగన్‌బాబే అని ప్రచారం చేశారు.. ఎవరో వర్మట.. సినిమా డెరైక్టరట.. ఆయనతో కూడా జగన్‌బాబు బెదిరించారని చెప్పిస్తున్నారు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా?(ఉండదు.. ఉండదు అంటూ ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన)
ఇదెక్కడి న్యాయం..?
రాష్ట్రంలో నిర్జీవంగా పడి ఉన్న కాంగ్రెస్‌ను 25 ఏళ్లపాటు ఉద్యమాలు, పోరాటాలు చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు సార్లు అధికారంలోకి తెచ్చారు. 25 ఏళ్లపాటు ప్రజల సమస్యలను దగ్గర నుంచి పరిశీలించిన వైఎస్.. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పథకాలు పెట్టారు. ఓ వైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమ పథకాలను చేపట్టారు. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల లాంటి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. నిరుపేదల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, పావలావడ్డీ రుణ పథకాలను చేపట్టారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని వైఎస్ భావించారు. పరిశ్రమలు రావాలంటే పారిశ్రామిక విధానం ప్రకారం భూమి.. నీళ్లు.. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది.
ఆ విధానం ప్రకారమే వైఎస్ భూములు కేటాయించారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి, ఉపాధి కోసం పరిశ్రమల స్థాపన కోసం వైఎస్ భూములు కేటాయిస్తే తప్పా? అదే చంద్రబాబు హైదరాబాద్ నడిబొడ్డున కోట్లాది రూపాయల విలువచేసే వందలాది ఎకరాలను చంద్రబాబు.. శ్రీమంతుల విలాసాలకు కేటాయిస్తే ఒప్పా? ఇదెక్కడి న్యాయం? వైఎస్ చేస్తే అవినీతి.. చంద్రబాబు చేస్తే నీతా?(చంద్రబాబుదే అవినీతి.. అవినీతి అంటూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన). వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ఏ ఒక్కరి కంట్లోనూ కన్నీరు లేకుండా.. అన్ని వర్గాల ప్రజలు బాగా బతికేలా పథకాలను అమలు చేశారు. సీబీఐ అక్రమమని చెబుతోన్న 26 జీవోలు మంత్రివర్గం తీసుకున్న సమష్టి నిర్ణయాలే. ఆ జీవోల విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మంత్రులతో బలవంతంగా సంతకాలు పెట్టించారని కాంగ్రెస్, సీబీఐ ప్రచారం చేస్తున్నాయి. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా..?(ఉండదు.. ఉండదు.. అంటూ నినదించిన ప్రజానీకం)
అభూత కల్పనల చంద్రబాబు..
వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని చంద్రబాబు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకం రూపొందించే సమయంలో వైఎస్ హయాంలో తొలుత రూ.పది వేల కోట్లు అవినీతి జరిగిందని.. ఆ తర్వాత రూ.30 వేల కోట్లు జరిగిందని.. ఆ తర్వాత చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందంటూ చంద్రబాబే తేల్చి, పుస్తకం వేయించారని మైసూరారెడ్డి(టీడీపీ మాజీ నేత) ఇటీవల స్వయంగా చెప్పారు. చంద్రబాబు అభూతకల్పనలతో వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని అవాస్తవాలను ప్రచారం చేశారు.
అనంతపురం, రాయదుర్గం ఉప ఎన్నికల ప్రచారంలో విజయమ్మ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, తోపుదుర్తి కవిత, వై.విశ్వేశ్వరరెడ్డి, పైలా నర్సింహయ్య, శంకరనారాయణ, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులున్నారు.

No comments:
Post a Comment