ఐఎన్‌టీయూసీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి మంగళవారం వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చవ్వా, ముగ్గురు మాజీ కార్పొరేటర్లు చవ్వా గీత, చవ్వా మనోహర్‌రెడ్డి, యడగూరి మాధవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి యడగూరి రామ్మోహన్‌రెడ్డి మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఉప ఎన్నికల ప్రచారం కోసం అనంతపురం వచ్చిన వైఎస్ విజయమ్మ, షర్మిల రోడ్‌షో ముగించుకుని మధ్యాహ్నం 2.50 గంటలకు స్థానిక అరవిందనగర్‌లోని చవ్వా రాజశేఖర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
అక్కడ విజయమ్మ సమక్షంలో వారందరూ పార్టీలో చేరారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మహబూబ్‌పీరా, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌తో పాటు వందలాది మంది కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. అనంతపురం అభ్యర్థి గురునాథరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విజయమ్మ సమక్షంలో కాంగ్రెస్ నేత మన్సూర్ మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. గతంలో ఈయన అనంతపురం పార్లమెంటు స్థానానికి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

No comments:
Post a Comment