- అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారం
- ప్రధాన పార్టీల అభ్యర్థుల వెన్నులో వణుకు
అనంతపురం, న్యూస్‌లైన్‌ప్రతినిధి: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, ‘అనంత’ ఆడపడచు అయిన వైఎస్ విజయమ్మ మంగళవారం అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనంతపురం.. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రాయదుర్గం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. వైఎస్ విజయమ్మ పర్యటన పుట్టింట్లో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపుతుంటే.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాయదుర్గం, అనంతపురం నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెల 6, 7, 8, 9, 10, 11 తేదీలలో ప్రచారం చేసిన విషయం విదితమే.
తొమ్మిది నెలలుగా జగన్ ఆస్తులపై దర్యాప్తు చేస్తోన్న సీబీఐ.. ఏ ఒక్క రోజు కూడా ఆయనను విచారణ కోసం తన వద్దకు పిలిచిన దాఖలాలు లేవు. జగన్‌కు జనం నీరాజనాలు పలుకుతుండటాన్ని చూసి ఉప ఎన్నికల్లో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేసుకున్న కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ కుమ్మక్కై సీబీఐని ప్రయోగించిన విషయం విదితమే. సీబీఐ కోర్టులో 28న హాజరు కావాలని జగన్‌కు సమన్లు జారీచేయడాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. 25నే తన ముందు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఉప ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగానే 27న జననేతను సీబీఐ అరెస్టు చేసింది. జగన్ అరెస్టుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచార బాధ్యతలను ఆపార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఉప ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆమెకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ విజయమ్మ సభలకు జనం అశేషంగా తరలివస్తోండటాన్ని చూసిన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు.. జిల్లాలో మంగళవారం ఆమె పర్యటించనుండటంతో ఆందోళన చెందుతున్నారు. వైఎస్ విజయమ్మ మంగళవారం ఉదయం పులివెందుల నుంచి అనంతపురానికి చేరుకుంటారు.
అనంతపురంలో మధ్యాహ్నం వరకు ప్రచారం చేసి.. ఆ తర్వాత రాయదుర్గం నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ రాత్రి వరకు ప్రచారం చేసి.. అర్ధరాత్రికి ఎమ్మిగనూరుకు చేరుకుంటారు. రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను విజయమ్మ, షర్మిల ప్రచారంలో ప్రజలకు వివరించనున్నారు. మహానేత వైఎస్ మరణం తర్వాత పాలను అదుపు తప్పడాన్ని.. పథకాలను నీరుగార్చడాన్ని ప్రజలకు చెప్పనున్నారు. ఆ పథకాలను నీరుగార్చడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి రాజన్న రాజ్యం మళ్లీ తెస్తానని ఉద్యమిస్తోన్న జగన్‌ను కాంగ్రెస్, టీడీపీలు ఎదుర్కోలేక సీబీఐతో అరెస్టు చేయించడాన్ని ఆమె జనం ముందు పెట్టనున్నారు.
వైఎస్ మరణంపై అనుమానాలను నివృత్తి చేయకుండా.. కాంగ్రెస్‌కు నూతన జవసత్వాలు అందించిన మహానేత కుటుంబాన్ని వేధిస్తోండటాన్ని ప్రజలకు వివరించనున్నారు. రైతుల కోసం.. పేదల కోసం పదవులను తృణప్రాయంగా వదులుకుని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీచేస్తోన్న బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలను ఆఖండ మెజార్టీతో గెలిపించాలని కోరనున్నారు.

When Sonia Gandhi herself is going against minimum principles why don't others?
ReplyDeleteIt is like the fence is grazing the crop.