రాష్ట్రంలో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోందని రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనకు ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ చేసిన తప్పేంటో ప్రభుత్వం చెప్పాలన్నారు.
ప్రజలతో ఉండటం..ప్రజల సంక్షేమం గురించి ఆలోచించడం జగన్ చేసిన తప్పా..? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వైఎస్ కుటుంబంపై విమర్శలు చేసేవారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ కుటుంబాన్ని వీడేది లేదని స్పష్టం చేశారు. పదవుల కోసం చిరంజీవి పార్టీని అమ్ముకున్నారని, విమర్శలు చేసేవారికి ఉప ఎన్నికల ద్వారా దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి ఓటర్లను కోరారు.

No comments:
Post a Comment