కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కుమార్తె షర్మిలతో పాటు ఆమె ఎర్రకోట సెయింట్ జాన్స్ కళాశాల నుంచి ఎమ్మిగనూరు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. సోమప్ప సర్కిల్, యంబి చర్చి ఏరియాలో ప్రసంగించిన అనంతరం ఆయా ప్రాంతాల్లో రోడ్‌షోగా మండల కేంద్రమైన గోనెగండ్ల చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆళ్లగడ్డకు చేరుకొని రోడ్‌షోలో పాల్గొంటారు. అక్కడి నాలుగు రోడ్ల కూడలిలో ప్రసంగించిన అనంతరం ప్రధాన వీధుల్లో రోడ్‌షో నిర్వహిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment