వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నియోజకవర్గాల వారీగా రైతు ధర్నాలు నిర్వహించాలని పార్టీ కేంద్ర పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నాయకురాలు, అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్స్ న్ తోపుదుర్తి కవిత చెప్పారు. సమావేశం అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ధర్నాలో రైతులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. పార్టీ నిర్మాణంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రామ కమిటీల ఏర్పాటు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
ఉపఎన్నికల్లో గెలుపోటములపై సమీక్ష జరిపినట్లు తెలిపారు. కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై చర్చించామన్నారు. తమ పార్టీకి ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉన్నందున రాష్ట్రపతి ఎన్నికల విషయం కూడా చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
తమ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిపై కుట్రలను సుప్రీం కోర్టు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకు వెళతామని వివరించారు. వైఎస్ సంక్షేమ పథకాల సాధనకై పోరాటాలు చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.
విలేకరుల సమావేశంలో కవితతోపాటు పార్టీ నేత జంగా కృష్ణమూర్తి కూడా మాట్లాడారు.

No comments:
Post a Comment