దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు ఎవరూ మర్చిపోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ అన్నారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు అత్యధిక మెజార్టీ వచ్చిందని చెప్పారు. జగన్ పై కుట్రలను ప్రధాని, ఇతర పార్టీల నేతల దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరం త్వరలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోమని అన్నారు. అసెంబ్లీ లోపల, బయట ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. నిజమైన ప్రతిపక్షమంటే ఏంటో చూపిస్తామన్నారు.
జగన్ సీఎం కావాలని ప్రజల్లో బలంగా ఉందని చెప్పారు. అన్నీ దేవుడు చూస్తున్నాడని, న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. జగన్ వీలైనంత త్వరగా బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ ఏ ప్రజాసమస్యను పట్టించుకోవడం లేదన్నారు. కేవలం వైఎస్ ని దూషించడమే చంద్రబాబు పనిగా ఉందన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కై ప్రజల పక్షంగా టిడిపి పోరాటాలు చేయడం మానేసిందన్నారు. ప్రతి సమస్యను తన సొంత సమస్యగా వైఎస్ భావించేవారని తెలిపారు. అందుకే ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉన్నారని చెప్పారు.

No comments:
Post a Comment