టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విదేశీ ఖాతాల గుట్టు విప్పిన కోలా కృష్ణమోహన్‌పై పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను విజయవాడ పోలీసులు వెలికి తీస్తున్నారు. తనకు యూరో లాటరీ తగిలిందని పలువురి వద్ద డబ్బులు తీసుకున్న కోలా వాటిని తిరిగి చెల్లించకపోవడంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చీటింగ్ కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఆయనపై 2010 నుంచి రెండు నాన్ బెయిల్‌బుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కోలా ఇటీవల చంద్రబాబు తనవద్ద డబ్బు తీసుకుని మోసం చేశారని, ఆయనకు పలు దేశాల్లో బ్యాంకు ఖాతాలున్నాయనే ఆరోపణలతో సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు పెండింగ్ వారెంట్లను బయటకు తీసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయన్ను అరెస్టు చేయడం ద్వారా నోరు నొక్కేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్ బయలుదేరినట్లు తెలిసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment