వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ వైఖరికి నిరసన తెలుపుతూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. లక్ష్మీనారాయణ దిష్టి బొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో కార్యకర్తలు లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నేత జమీర్ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు జేడీ లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పార్టీ నేత వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి, దహనం చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పార్టీ నేత పీకే కృష్ణ ఆధ్వర్యంలో కార్యకర్తలు జేడీ లక్ష్మీనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment