YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday, 23 June 2012

రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

 సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో కలిసి భూ సెటిల్‌మెంట్‌లు చేసిన వ్యవహారంలో తెలుగుదేశం యువ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మహబూబ్‌నగర్ జిల్లా తలకొండపల్లి మండలం తకరాజుగూడ శివారులోని చల్లంపల్లి గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ మహిళకు చెందిన భూమిని స్వాహాచేసిన గుట్టును రట్టు చేసేందుకు రాష్ర్ట నేర పరిశోధన విభాగం(సీఐడీ) రంగంలోకి దిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న భాను కిరణ్, దంతులూరి కృష్ణను సీఐడీ పోలీసులు శనివారం కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసునకు సంబంధించి వీరిద్దర్నీ ఐదురోజులపాటు విచారించనున్నారు. చల్లంపల్లి గ్రామంలో టి.సునీత అనే ఎన్‌ఆర్‌ఐకి చెందిన 25 ఎకరాల భూమిని స్వాహాచేసిన వ్యవహారంపై సీఐడీ అధికారులు విచారణ జరిపి కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. 

సునీత వర్జీనియాలో ఉంటున్న విషయం తెలిసి చ ల్లంపల్లి గ్రామంలో ఆమెకున్న 25 ఎకరాలను కొట్టేసేందుకు నిందితులు ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించారు. ఈ విషయం తెలిసిన ఆమె స్వగ్రామానికి తిరిగివచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో భానుకిరణ్, దంతులూరి కృష్ణతో కలసి రేవంత్‌రెడ్డి సెటిల్‌మెంట్ చేసినట్లు సీఐడీ ప్రాథమిక విచారణలో తేలింది. అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను సేకరించేందుకు భానుకిరణ్, కృష్ణలను సీఐడీ కస్టడీకి తీసుకుంది. చర్లపల్లి జైలు నుంచి వారిని శనివారం ఉదయం కస్టడీకి తీసుకుని.. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల తరువాత విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం రాత్రి కూడా సీఐడీ కార్యాలయంలోని సెల్‌లోనే వారిని ఉంచుతారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కూడా సీఐడీ విచారించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

1 comment:

  1. Such people, now, are under the fullest protection of ruling INC. So nothing will happen till the rule is changed.
    Revanth Reddy is the strongest in TD with his boss CBN, supported by INC.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!