వైఎస్ జగన్ కేసు విచారణ జరిపేందుకు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అనర్హుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష్మినారాయణను తక్షణమే తొలగించాలని అంబటి, బాజిరెడ్డి డిమాండ్ చేశారు. మీడియా రిపోర్టర్లను తప్పబట్టడం తమ ఉద్దేశం కాదని వారు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
జేడీ మోబైల్ ఫోన్ కు సంబంధించిన కాల్ లిస్ట్ వివరాలను, ఆధారాలను ప్రధాని మన్మోహన్ సింగ్ కు, రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ కు అందజేస్తామని వారన్నారు. ఈ విషయంలో క్రైం రిపోర్టర్లు దయచేసి అపార్థం చేసుకోవద్దన్నారు. జేడీతో క్రైం రిపోర్టర్లు ఎన్ని సార్లు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదని అంబటి స్పష్టం చేశారు. కానీ మీడియాతో జేడీ ఎందుకు మాట్లాడారో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
సీబీఐ మాన్యువెల్, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా జేడీ వ్యవహరించారని అంబటి ఆరోపించారు. తమ ప్రశ్నలకు జేడీ సమాధానం చెప్పాలని, మీడియా కాదన్నారు. మీడియా ప్రతినిధులకు వైఎస్ఆర్ సీపీ పూర్తి అండగా ఉంటుందన్నారు. క్రైం రిపోర్టర్లు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అంబటి, బాజిరెడ్డి అన్నారు.

No comments:
Post a Comment