YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 22 June 2012

‘లీకు’ వీరుడు!!


హైదరాబాద్, జూన్ 21: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, కడప లోక్‌సభ సభ్యుడు జగన్మోహన్‌రెడ్డి ‘అక్రమ’ ఆస్తుల కేసు విచారణలో కీలక పాత్ర వహిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ చిక్కుల్లో పడనున్నారా? జగన్‌పై కేసు విచారణలో ఉన్న సమయంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ‘వాసిరెడ్డి చంద్రబాల’ అనే మహిళతో, కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టెలిఫోన్ల జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ గురువారం బయటపెట్టింది. లక్ష్మీనారాయణ ఎవరెవరితో ఎన్నిసార్లు మాట్లాడారన్న వివరాల గుట్టును పార్టీ నేతలు బయటపెట్టారు. ముఖ్యంగా వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ గత మార్చి నుంచి జూన్ పదిహేడో తేదీ వరకు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతో 432సార్లు మాట్లాడారని వైఎస్సార్‌సీపీ వివరించింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణతో పదిసార్లు మాట్లాడినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో పేర్కొన్నారు. ‘ఎవరీ చంద్రబాల? ఆమెతో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నిసార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జి శ్రీకాంత్‌రెడ్డి, శోభానాగిరెడ్డి తదితరులు ప్రశ్నించారు. వాసిరెడ్డి చంద్రబాల మొబైల్ ఫోన్‌నుంచి లక్ష్మీనారాయణకు వచ్చిన ఫోన్ కాల్స్ వ్యవహారంపై సుప్రీం కోర్టు సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చంద్రబాల నుంచి ఒక పత్రికాధిపతికి ఫోన్ కాల్స్ వెళ్లడం చూస్తుంటే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి జగన్మోహన్ రెడ్డికి హాని చేసే కుట్రలు జరుగుతున్నట్టు అనుమానాలు ధృవపడుతున్నాయని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, శోభానాగిరెడ్డి తదితరులు ఆరోపించారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి చంద్రబాలకు, వివిధ మీడియా సంస్థల ప్రతినిధులకు చేసిన ఫోన్స్, అలాగే చంద్రబాల నుంచి సిబిఐ జెడికి వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను వారు విడుదల చేశారు. అందులో పేర్కొన్న దాని ప్రకారం గత మార్చి నుంచి జూన్ 17వరకు ఫోన్ కాల్స్ వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నంబర్ 9441433444 నుంచి వివిధ మీడియా ప్రతినిధులకు, వాసిరెడ్డి చంద్రబాలకు వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు
ఫోన్ నంబర్ పేరు కాల్స్ సంఖ్య
9618490234 వాసిరెడ్డి చంద్రబాల 328
9951955055 నాగమారుతి శర్మ 5
9985494998 ఆంధ్రజ్యోతి పవన్ 5
9948299868 టీవీ 9 మురళీధర్ 5
9010234298 ఎన్టీవీ అరవింద్‌శర్మ 18
9490618089 ఆంధ్రజ్యోతి ఎబిఎన్ వెంకట్ 54
8008002223 ఈనాడు విశ్వప్రసాద్ 11
8008771053 ఈనాడు వీరభద్రం 56
9703618700 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సత్యనారాయణ 94
9849041904 ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విక్రమశర్మ 107
9866305825 టైమ్ ఆఫ్ ఇండియా బి కృష్ణప్రసాద్ 123
9490618068 రమేష్ వైట్ల 142
9966608777 టీవీ-9 మహాత్మా 381
వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ మొబైల్ ఫోన్ 9618490234 నుంచి సిబిఐ జెడి లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖులకు వెళ్లిన ఫోన్ కాల్స్ వివరాలు.
9441433444 వివి లక్ష్మీనారాయణ 411
9441113444 వివి లక్ష్మీనారాయణ 21
9985411111 రాధాకృష్ణ (ఆంధ్రజ్యోతి) 10
8886200013 డెల్లాయిట్, హైదరాబాద్ 10
9849016366 జెవి రాముడు, ఐపిఎస్ 15
దర్యాప్తు లీకు చేస్తున్న సిబిఐ జెడి
మీడియాలో ఉన్న పోటీని, వైరాన్ని అడ్డుపెట్టుకుని, అందులో కొందరిని తన పథకంలో భాగస్వాములుగా మార్చుకోవడమో, లేక వారి పథకంలో తాను భాగం కావడం వరకు సిబిఐ జెడి లక్ష్మీనారాయణ వెళ్లిపోయారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. సిబిఐ మాన్యువల్ ప్రకారం సిబిఐ తప్పుడు ప్రచారం చేయకూడదన్నారు. కేసుకు సంబంధించి మీడియాలో వచ్చే కథనాల మీద ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాలన్నారు. సాక్షి మీడియాను ప్రత్యర్ధిగా చేస్తున్న చానళ్లకు జగన్ ఆస్తుల కేసులో అసత్యాలను సరఫరా చేసే సంస్థగా సిబిఐ తయారైందన్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ జెడి లక్ష్మీనారాయణ ఫోన్ నుంచి వెళ్లిన దానికి, వచ్చిన కాల్స్ వివరాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వీటిని పరిశీలించిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి విచారణ పేరిట జరుగుతున్న తంతులో చాలా లోతైన కుట్ర దాగి ఉందని ఎవరికైనా అర్థమవుతుందన్నారు. ఈ ఫోన్లలో ఒక వర్గం వారికి వెళ్లిన ఫోన్లు ఉన్నాయన్నారు. దర్యాప్తుతో సంబంధంలేని అధికారులకు వెళ్లిన ఫోన్లు ఉన్నాయి. అన్నింటికంటే దిగ్భ్రాంతికరమైన విషయమేమిటంటే, వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ ఫోన్‌కు జెడి నుంచి, ఆమె ఫోన్ నుంచి జెడికి ఒక ప్రవాహంలా ఫోన్‌కాల్స్ రావడం, వెళ్లడం కనిపించిందన్నారు. వాసిరెడ్డి చంద్రబాల ఫోన్ నుంచి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు, మీడియాలో ఒకవర్గం వారికి విపరీతంగా ఫోన్‌కాల్స్ వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాల పాత్ర మీద విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కోరారు.

http://www.andhrabhoomi.net/node/31845

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!