వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిమిత్తం హైకోర్టును ఆశ్రయించారు.నాంపల్లి సిబిఐ కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన మీదట ఇప్పుడు హైకోర్టుకు వెళ్లారు. తొమ్మిది నెలలపాటు విచారణ చేసినా సిబిఐ తనపై ఎలాంటి ఆధారాలు సంపాదించలేకపోయిందని, రాజకీయ దురుద్దేశ్యంతోనే విచారణ జరుగుతోందని, తాను ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉన్నానని ఆయన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కు సంబంధించి కాల్ప్ జాబితాను విడుదల చేసిన తర్వాత వ్యూహాత్మకంగా బెయిల్ పిటిషన్ ను వేసినట్లు కనబడుతుంది.రెండు,మూడు రోజులలో ఈ పిటిషన్ విచారణకు రావచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment