లాస్ ఏంజెల్స్ : వైఎస్ జగన్ అరెస్ట్‌ను నిరసిస్తూ అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ అభిమానులు సోనియాగాంధీ దిష్టి బొమ్మని కర్రలతో కొట్టి నిరసన తెలిపారు. అమెరికా చరిత్రలో ఇలాంటి నిరసన తెలపడం ఇదే తొలిసారి. ఇలాంటి నిరసనలకు అక్కడ అనుమతి ఉండదు.
కాంగ్రెస్ ప్రభుత్వం జగన్‌పై కుట్రపన్ని కేసుల రూపంలో వేధిస్తుందని అభిమానులు ఆరోపించారు. జగన్‌ను విడుదల చేయాలంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో అరాచకాలు ఉండేవని, ఇప్పుడు రాష్ట్రంలో ఇటలీ పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో నంద్యాల వీరారెడ్డి, గుమ్మడి ధర్మారెడ్డి, నాగేశ్వరావు, శ్రీకాంత్, కోమటిరెడ్డి, వేణు, రాజారెడ్డి, సందీప్, రాజశేఖర్, లక్ష్మ రెడ్డి పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment