Saturday, 23 June 2012
తిరుపతిలో మద్యం నిషేధించాలి: భూమన
తిరుపతి పవిత్రతను కాపాడేందుకు మద్యపానాన్ని నిషేధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన శనివారమిక్కడ కోరారు. లేకుంటే రేపటినుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని భూమన హెచ్చరించారు. తిరుపతిలో మద్య నిషేధం అమలు చేసేవరకూ దీక్ష కొనసాగిస్తానని ఆయన తెలిపారు. తిరుపతి అభివృద్ధి నిధులను పదిహేను రోజుల్లో విడుదల చేయాలన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment