రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ లీగల్‌సెల్ తెలిపింది. లక్ష్మీనారాయణ తీరు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసేదిలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నార్కో అనాలసిస్ పరీక్షలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరించి జగన్‌కు అవే పరీక్షలు చేయాలని లక్ష్మీనారాయణ పట్టుపట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం లీగల్‌సెల్ సమావేశమైంది. ఆ వివరాలను న్యాయవాది వై.నాగిరెడ్డితో కలిసి లీగల్‌సెల్ కన్వీనర్ చిత్తర్వు నాగేశ్వరరావు విలేకరులకు తెలిపారు. సీబీఐ బుక్‌రూల్‌కు విరుద్ధంగా వ్యవహరించిన జేడీ లక్ష్మీనారాయణపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘నార్కో పరీక్షలపై కృషి బ్యాంకు వెంకటేశ్వరరావు విషయంలో సుప్రీం కోర్టు ఫుల్‌బెంచ్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఆర్టికల్ 21కు ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. నార్కో పరీక్షల ద్వారా స్పృహలో లేని వ్యక్తి ఇచ్చే ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది. ఆ టెస్టుల ద్వారా మనిషి బ్రెయిన్ దెబ్బతినడమే కాకుండా మూత్రపిండాలు పాడయ్యే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment