వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జూలై 4కు వాయిదాపడింది. ఈ పిటిషన్‌ను గురువారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎ.పుల్లయ్య విచారించారు. ఈ పిటిషన్‌పై తమ వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇప్పటికే రెండు పర్యాయాలు వాయిదా తీసుకున్నారని, కోర్టులో విచారణ అవసరం లేదని భావిస్తే పిటిషన్‌ను సీబీఐ ఉపసంహరించుకోవాలని సూచించారు. అయితే సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను జూలై 4కు వాయిదా వేశారు.
మోపిదేవి రిమాండ్ పొడిగింపు
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, వాన్‌పిక్ సంస్థల అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌ఏఎస్ అధికారి బీకే బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను జూలై 6 వరకు పొడిగించారు. గురువారం చంచల్‌గూడ జైలు నుంచి వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీరిని న్యాయమూర్తి పుల్లయ్య ఎదుట హాజరుపర్చారు.

No comments:
Post a Comment