రాష్ట్రపతి ఎన్నికల్లో పీఏ సంగ్మాకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ప్రజాస్వామ్యంలో పోటీ అనివార్యమని అభిప్రాయపడింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో కూటమిలోని పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్న మాట వాస్తవమేనని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ప్రకటించారు. పీఎ సంగ్మా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని ఆమె కొనియాడారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని సుష్మా తేల్చి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీయేలో చీలికలు వచ్చాయి. కూటమిలోని మిగిలిన పార్టీల అభిప్రాయంతో బీజేపీ విభేదించింది.
Thursday, 21 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment