వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం లభించడం కలేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన ఇక్కడ రామచంద్రాపురం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఆర్పీ కార్యకర్తలను కాంగ్రెస్ పట్టించుకోకపోవడం వల్లే ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ నేతలకు సరైన గుర్తింపు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పీఆర్పీ మాజీ నేతలంతా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు.
పార్టీలో సీనియర్లు కొందరు సహకరించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవులను పీఆర్పీ నేతలకు ఇవ్వాలని కోరారు.
పార్టీలో సీనియర్లు కొందరు సహకరించడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు అభద్రతా భావంలో ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవులను పీఆర్పీ నేతలకు ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment