మహాత్ముడి సాక్షిగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. కనివిని ఎరగని రీతిలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. వైఎస్ జగన్‌పై సీబీఐ అక్రమ కేసులకు వ్యతిరేకంగా అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన దీక్షకు దిగారు. చాలాసేపు ఎమ్మెల్యేలను గాంధీ విగ్రహం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ విషయంలో స్పీకర్ తీరుపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలమైన తాము శాంతియుతంగా గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలపడం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. గాంధీ విగ్రహాన్ని కూడా నిర్బంధిస్తారా అని ప్రశ్నించారు. కాగా దీక్షకు అనుమతి లేదంటూ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments:
Post a Comment