YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 22 June 2012

పరిశ్రమలు పరార్!


6.78 లక్షల మందికి ఉపాధి అంటూ ఊదర
ఉపాధి లభించింది 1,720 వుందికి వూత్రమే
ఓడలు బళ్లయిన చందంగా రాష్ట్ర ఐటీ రంగం 
రావాల్సినవి కూడా పక్క రాష్ట్రాలకు.. 
అనిశ్చిత వాతావరణం, అకారణ వేధింపులే కారణమంటున్న పారిశ్రామిక వర్గాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్:రాష్ట్రం నుంచి పరిశ్రవులు పరారవుతున్నారుు. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకే జంకుతున్నారుు. ప్రభుత్వంతో అట్టహాసంగా కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలన్నీ కాగితాలకే పరిమితవువుతున్నారుు. గత ఏడాది కాలంలో కొత్తగా ఒక్కటంటే ఒక్క పరిశ్రవు కూడా రాష్ట్రంలో ఏర్పాటవకలేదు! రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించిన భాగస్వావ్యు ఒప్పందం కాస్తా ఆచరణలో బావురువుంది. గత జనవరి 11-13 తేదీల మధ్య హైదరాబాద్‌లో జరిగిన భాగస్వావ్యు ఒప్పందంలో రాష్ట్రంలో మొత్తం 265 యుూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయుని, వీటితో ఏకంగా 6.78 లక్షల వుందికి ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించడం తెలిసిందే. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.6.49 లక్షల కోట్ల పెట్టుబడులు తరలి వస్తాయుంటూ ఆయన గొప్పలకు పోయారు. ప్రాజెక్టుల అవులుకు ఎస్కార్ట్ అధికారిని నియుమిస్తావుని ప్రకటనలు కూడా చేశారు. కానీ ఆ భారీ భాగస్వావ్యు తంతు వుుగిసి ఐదు నెలలు గడిచాయి. కానీ సదరు ఎంవోయూలపై పురోగతి పెద్దగా లేదు. కేవలం నాలుగంటే నాలుగే పరిశ్రవులు ఉత్పత్తిని ప్రారంభించారుు. ఈ విషయూన్ని స్వయుంగా పరిశ్రవుల శాఖే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కొది ్దరోజుల క్రితం సవుర్పించిన నివేదికలో పేర్కొనడం విశేషం! ఈ నాలుగూ గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయుంలో వుుందుకొచ్చిన పరిశ్రవులే కావడం గమనార్హం! ఈ నాలుగు కంపెనీల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి కేవలం రూ.510 కోట్లు. ఉపాధి లభించింది 1720 వుందికి వూత్రమే. మరికొన్ని యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నా.. అవి కూడా వైఎస్, రోశయ్యల హయాంలో వచ్చినవే. కిరణ్ పగ్గాలు చేపట్టాక ముందుకొచ్చి రాష్ట్రంలో పనులు ప్రారంభించిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. రాష్ట్రం విషయంలో పరిశ్రమలు ఇలా ముఖం చాటేయడానికి ఇక్కడ నెలకొన్న రాజకీయు అనిశ్చితి, సీబీఐ విచారణల పేరుతో పారిశ్రామికవేత్తలపై వేధింపులతో పాటు విద్యుత్ కోతల వంటివి కారణవుని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితులిలాగే ఉంటే సమీప భవిష్యత్తులోనూ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారుు.

వచ్చినవీ పాతవే..!: భాగస్వావ్యు సదస్సులో ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టుల అవులుకు నియుమించిన ఎస్కార్ట్ అధికారులు ఒక్కసారి కూడా సవూవేశం కాలేదు. రాష్ట్రంలో యుూనిట్ల ఏర్పాటుకు పరిశ్రవులు వుుందుకు రాకపోవడమే ఇందుకు కారణవుంటున్నారు. వచ్చిన నాలుగూ పాత పరిశ్రవులేనని పరిశ్రవుల శాఖ వర్గాలు తెలిపారుు. ఆర్భాటంగా భారీ ఒప్పందాలు కుదుర్చుకుని, తర్వాత ఒక్క పరిశ్రమా రాని వైనం బాబు హయాంను గుర్తుకు తెస్తోందని పరిశ్రవుల శాఖ ఉన్నతాధికారి ఒకరన్నారు. అప్పట్లో పేరుకు వందలాది పరిశ్రవులతో ఒప్పందాలు కుదుర్చుకున్నా ఏర్పాటైనవి మాత్రం కొన్నేనని ఆయన గుర్తు చేశారు. ఇక విద్యుత్, వలిక సదుపాయూలు, ఉన్నత విద్య, పర్యాటక రంగాల్లో ఒప్పందం కుదుర్చుకున్న ఒక్క పరిశ్రవు కూడా రాష్ట్రంలో యుూనిట్ ఏర్పాటు చేయులేదు. ‘‘ఐటీ హబ్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హైదరాబాద్‌లో కూడా ఆ రంగానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్న ఒక్క కంపెనీ కూడా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం రాష్ట్ర అధోగతికి సూచికే. అనిశ్చిత పరిస్థితులు, పారిశ్రామికవేత్తలపై సీబీఐ విచారణ తదితరాలతో రాష్ర్టంలో పెట్టుబడి పెట్టేందుకు జంకే పరిస్థితి ఏర్పడింది’’ అని ఆయనన్నారు. ఎంతోకాలంగా వుంచి ఇన్వెస్టరుగా పేరు పొందిన పారిశ్రామిక దిగ్గజం నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అరెస్టు చేయుడం, పలువురు పారిశ్రామికవేత్తలను విచారణ పేరిట గంటల కొద్దీ వేధించడం కూడా ఇన్వెస్టర్లలో ప్రభుత్వంపై నవ్ముకాన్ని సడలింపజేసిందని అంటున్నారు.

వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలు

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి విద్యుత్ సరఫరా విషయంలో హామీ లేకపోవడం కూడా ప్రధాన అవరోధంగా మారుతోందని పరిశ్రమల శాఖ అధికారులే చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో కూడా పరిశ్రవులకు విద్యుత్ కోతలు అవులవుతుండటం బాగా ప్రతికూలంగా పరిణమించిందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేసవిలో వారానికి 3 రోజుల పాటు పరిశ్రమలకు పవర్ హాలిడేలు మామూలే అయినా, రెండేళ్లుగా దాన్ని ఏడాది పొడవునా అమలు చేస్తున్నారు! ‘‘ఈ కారణంగానే గత ఆరు నెలల్లో ఏకంగా 50కి పైగా మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిస్థితి చూసి కొత్తగా వచ్చేవారు భయపడుతున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు గ్యాస్ తరలించకుండా ప్రభుత్వం అడ్డుకోకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువ ధరకు కక్కుర్తి పడి అవి పొరుగు రాష్ట్రాలకు అమ్ముకుంటున్నా సర్కారు సీరియస్‌గా పట్టించుకోవడం లేదంటున్నారు.

రావాల్సినవీ హుళక్కే..!
కొత్తగా పరిశ్రవులు రావడం దేవుడెరుగు.. రాష్ట్రంలో యుూనిట్లు ఏర్పాటు చేస్తావుని గతంలో ప్రకటించిన కంపెనీలు కూడా ఇప్పుడు పొలోమంటూ పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారుు. రాష్ట్రంలో అణు విద్యుత్ పరికరాల తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వైఎస్ హయాంలో వుుందుకొచ్చిన భారత్ ఫోర్జ్ కంపెనీ ఆయున వురణానంతరం వుహారాష్ట్రకు వెళ్లిపోరుుంది. పాలీ సిలికాన్ తయూరీ యుూనిట్ ఏర్పాటుకు వుుందుకొచ్చిన యుశ్ బిర్లా గ్రూపు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోరుుంది. రాష్ట్రంలోనే కచ్చితంగా కార్ల తయూరీ యుూని ట్‌ను ఏర్పాటు చేస్తావుని వైఎస్ హయాంలో ప్రకటించిన ఫ్రాన్స్ కార్ల దిగ్గజం ఫ్యూజీ గుజరాత్ బాట పట్టింది. మరెన్నో కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!